ప్రభాస్‌, అల్లు అర్జున్‌ ఒకే తెరపై కనిపిస్తే.. సాధ్యమేనా?

Published : Aug 28, 2020, 09:14 PM IST
ప్రభాస్‌, అల్లు అర్జున్‌ ఒకే తెరపై కనిపిస్తే.. సాధ్యమేనా?

సారాంశం

తాను కూడా ఓ మల్టీస్టారర్‌ సినిమా చేయాలని అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు ప్లాన్‌ చేస్తున్నారట. తమ బ్యానర్‌లో ప్రభాస్‌, అల్లు అర్జున్‌ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్‌ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. 

నేషనల్‌ స్టార్‌ ప్రభాస్‌.. సౌత్‌ స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కలిసి ఒకే తెరపై కనిపిస్తే.. ఇద్దరు కలిసి ప్రత్యర్దులపైకి ఎగబడితే.. ఇక రణరంగమే.. అది ఊహించడానికి కష్టంగా ఉంది. కానీ నిజమైతే అదో కనువిందు. ఇద్దరు హీరోల అభిమానులకు కన్నుల పండగ. ఇండియన్‌ బాక్సాఫీస్‌కి అదో పెద్ద కాసుల పండగ. భారీ కలెక్షన్లతో బాక్సాఫీసు షేక్‌ కావాల్సిందే. మరి ఇది సాధ్యమేనా? అంటే ఓ బడా ప్రొడ్యూసర్‌ మాత్రం దీన్ని సాధ్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారట.

ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ సినిమాల జోరు ఊపందుకుంది. ఇప్పుడు `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్నారు. చిరంజీవి నెక్ట్స్ సినిమా కూడా మల్టీస్టారరే. మరోవైపు హిందీ, తమిళంలో మల్టీస్టారర్‌ సినిమాలు రూపొందుతున్నాయి. 

ఈ నేపథ్యంలో తాను కూడా ఓ మల్టీస్టారర్‌ సినిమా చేయాలని అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు ప్లాన్‌ చేస్తున్నారట. తమ బ్యానర్‌లో ప్రభాస్‌, అల్లు అర్జున్‌ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్‌ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. 

దిల్‌రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు ప్రభాస్‌ ఓ కమిట్‌మెంట్‌ ఉందట. గతంలోనే ఈ సినిమా చేయాల్సి ఉన్నా అది వర్కౌట్‌ కాలేదు. అలాగే `డీజే` తర్వాత అల్లు అర్జున్‌ కూడా దిల్‌రాజుతో ఓ సినిమా చేయాలనుకున్నారట. అది కూడా కుదరలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు హీరోలను కలిపి మల్టీస్టారర్‌ చేస్తే బాగుంటుందని దిల్‌రాజు భావిస్తున్నారట. మరి ఇది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. 

ప్రస్తుతం అల్లు అర్జున్‌..`పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్‌ డైరెక్షన్‌లో ఇది రూపొందుతుంది. దీంతోపాటు కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకి ఇటీవల గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం ప్రభాస్‌ `రాధేశ్యామ్‌`లో నటిస్తుండగా, ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ఓ సైన్స్ ఫిక్షన్‌, దీంతోపాటు బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో `ఆదిపురుష్‌` పేరుతో మరో సినిమా చేయాల్సి ఉంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్