బండ్ల గ‌ణేష్ ఎన్టీఆర్ మ‌ధ్య గొడ‌వ ముగిసిందా

Published : Aug 30, 2017, 07:08 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
బండ్ల గ‌ణేష్ ఎన్టీఆర్ మ‌ధ్య గొడ‌వ ముగిసిందా

సారాంశం

టాలీవుడ్ లో చిన్న ఆర్టిస్ట్ నుండి పెద్ద నిర్మాత‌గా ఎదిగాడు  బండ్ల గ‌ణేష్ స్టార్ హిరోల‌తో భారీ బ‌డ్జెట్ సినిమాలు తెర‌కెక్కించాడు  ఎన్టీఆర్ తో భాద్షా  టెంప‌ర్ మూవీలు తీసి న‌ష్ట‌పొయిన బండ్ల గ‌ణేష్ ఇప్పుడు మ‌ళ్లి ఎన్టీఆర్ తోనే మూవీ తీయాబొతున్నాడు

 

ఇప్పుడు ఫిలిం ఇండస్ర్టీలో చాలామంది కొంత కాలం స్నేహితులుగా.. కొంతకాలం శత్రువులుగా ఉంటుంటారు. ఎవ్వరూ కూడా పర్మినెంట్ గా ఒకే తరహాలో ఉండిపోరు. అలా ఉంటే మాత్రం వారిని ఎవ్వరూ మార్చలేరులే. అయితే గత కొంత కాలంగా ఎన్టీఆర్ కు అలాగే నిర్మాత బండ్ల గణేష్ కు ఏవో తేడాలు వచ్చేశాయి. ఇప్పుడు అవన్నీ పక్కనెట్టేసి ఈ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ తో ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నాడా 

నిజానికి ఎన్టీఆర్ అసలు బండ్ల గణేష్ తో ప్యాచప్ ఎలా అయ్యాడో తెలియదు కాని.. అయినట్లు న్యూసులు వస్తున్నాయి. అప్పటికే 'బాద్షా' సినిమా ఎన్టీఆర్ తో తీసి.. అది హిట్టయినా కూడా డబ్బులు నష్టపోయాడు గణేష్. ఆ తరువాత 'టెంపర్' సినిమాతో రికవరీ అవుతాడు అనుకుంటే.. అప్పుడు కూడా ఏవో గొడవలు వచ్చేశాయి. పేమెంట్ మొత్తం ఇస్తేనే ఎన్టీఆర్ డబ్బింగ్ చెబుతానన్నాడని రూమర్లు కూడా వినిపించాయి.

 అవన్నీ కరక్టే అన్న చందాన బండ్ల బాబు కూడా చాలా ఇంటర్యూల్లో అవాకులూ చివాకులూ పేలాడు. కట్ చేస్తే అసలు టెంపర్ సినిమాను సచిన్ జోషి కొనేసుకుని.. తనకు బండ్ల చాలా డబ్బులు అప్పుబడ్డాడంటూ కోర్టుకు కూడా వెళ్ళాడు. ఇవన్నీ జరుగుతుంటే.. బండ్ల మాత్రం టెంపర్ తరువాత మళ్లీ సినిమానే ప్రొడ్యూస్ చేయలేదు. బండ్ల నిజంగానే ఏదో గడబిడ చేశాడంటూ చాలా రూమర్లు వచ్చాయిలే.

ఇకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ తో మనోడు ప్యాచప్ చేసుకుని ఓ కొత్త సినిమాను తీస్తున్నాడు అంటూ రూమర్లు వచ్చాయిగాని.. అందులో నిజంలేదనే అంటున్నారు సన్నిహితులు. ప్యాచప్ సంగతి చెప్పలేం కాని. ఎన్టీఆర్ మాత్రం తదుపరి త్రివిక్రమ్ తో కొరటాల శివతో చేసే సినిమాలకు ఆల్రెడీ వేరే ప్రొడ్యూసర్లు కన్ఫామ్ అయిపోయారు. అది సంగతి. 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?