సైరా నరసింహారెడ్డి.. తెర వెనుక ఏం జరిగింది..మరో బాహుబలి అవుతుందా?

First Published Aug 29, 2017, 7:30 PM IST
Highlights
  • ఇపుడు ఇండస్ట్రీలో ఒకటే  ప్రశ్న... చిరంజీవి ఉయ్యాలవాడ మరొక బాహుబలి అవుతుందా​ని..
  • బ్రిటిష్ వాళ్లతో తలపడి అమరుడయిన యోధుడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
  • సైరా ​పేరుతో మెగా స్టార్ చిరంజీవి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే
ఉయ్యాలవాడ సినిమా ఆలోచన ఎలా వచ్చింది?

నిజానికి ఈ ఆలోచన ఇప్పటిది కాదు..ఠాగూర్ సినిమా కన్నా ముందే ఈ ఉయ్యాలవాడను తెరకెక్కించాలని చిరంజీవి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే, అది  కార్యరూపం దాల్చిందుకు ఇంతకాలం పట్టింది.పదేళ్ళ క్రితమే ఈ ప్రాజెక్ట్ పై చాలా సీరియస్ గా వర్క్ జరిగింది. ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ ఈ సినిమా కోసం దాదాపు సంవత్సరం పాటు పనిచేశారంటేనే ,ఈ సినిమా కథా వస్తువు ఎంతక్లిష్టం గా ఉంటుందో ఈజీ గానే అర్ధం చేసుకోవచ్చు..చిరంజీవి ఖైదీ నం.150 తర్వాత ఏ తరహా స్క్రిప్ట్ తో సినిమా చేయాలా అని ఆలోచిస్తున్న తరుణం లో అనూహ్యం గా  ఈ కథ మదిలో మెదలడం,పక్కన పెట్టిన ఈ ప్రాజెక్ట్ కి తుది మెరుగులు దిద్దడం చక చకా జరిగిన పరిణామాలు. ఇకపోతే సినిమా ప్రారంభం నుంచే హైప్ క్రియేట్ చేసేందుకు మెగా స్కెచ్ వేశారని అర్ధమవుతూనే ఉంది..బాహుబలి రికార్డ్స్ ని క్రాస్ చేయాలనే టార్గెట్ తో చెర్రీ ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారని యూనిట్ వర్గాలు చెబుతున్న మాట. కలెక్షన్స్ పరంగా హిస్టరీ క్రియేట్ చేయాలనే లక్ష్యం తో తెలుగు తో పాటు హిందీ,తమిళ్,కన్నడ భాషలలో ....వీలుని బట్టి మరికొన్ని భాషలలో ''సై రా '' ని  రూపొందించడానికి సన్నాహాలు చెస్తున్నారు. క్రేజ్ కోసం బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ ని,కన్నడ సూపర్స్టార్ సుదీప్ ని,తమిళ్ హీరొ విజయ్ సేతుపతి ని ఎంచుకున్నారు.

ఎవరీ ఉయ్యాలవాడ ?

రాయలసీమ నుంచి తొలినాళ్ల స్వాతంత్ర్య సమర యోధుడిగా చరిత్రకెక్కిన ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్రను సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించేందుకు మెగా కాంపౌండ్ నిర్ణయం తీసుకోవడమే ఒక సెన్సేషన్. చరిత్ర లో కొన్ని వాస్తవాలు కాలం తో పాటు మారుతుంటాయనే దానికి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితమే ఒక ఉదాహరణ.ఉయ్యాలవాడ ఒక యోధుడు...అందులో ఎలాంటి సందేహం లేదు.దాదాపు తొమ్మిది నెలల పాటు బ్రిటీష్ వారితో పోరాటం సాగించాడంటేనే ఆయన ఎలాంటి వీరుడో  అర్ధం చేసుకోవచ్చు..కనబడీ కనబడకుండా గెరిల్లా యుద్ధ తంత్రం తో పోరాటం కొనసాగించి బ్రిటీష్ సైనికుల్ని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించి " సైరా సై సై రా" అంటూ సవాల్ విసిరిన సైనిక తంత్రం ఆయనది. అయితే ఉయ్యాలవాడ బ్రిటీష్ వారితో ఎందుకు తల పడ్డాడు ? అనే విషయం లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్వాతంత్ర్య సంగ్రామం అనే ప్రశ్నే ఉదయించని కాలం లో ఆయన బ్రిటీష్ – ఇండియా ప్రభుత్వం తో పోరుకి సిద్ధమయ్యాడు. రైతుల నుండి కప్పం వసూలు చేసే విషయం లో వచ్చిన తేడాలే చినికి చినికి గాలి వానలా మొదలై పోరుకు బీజం వేసింది ఒక వాదన. అయితే మెలమెల్లగా ఉయ్యాలవాడ ను ఒక స్వాతంత్ర్య సమర యోధుడిగాగుర్తించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏది ఎలా ఉన్నప్పటికీ రాయలసీమ పౌరుషానికి ఉయ్యాలవాడ ను ప్రతీక గా,ఉదాహరణ గా చెప్పుకోవడం నూటికి నూరు శాతం సమంజసం. ఉయ్యాలవాడ ఒక వ్యక్తి కాదు..శక్తి అని కీర్తించుకోవడం తెలుగు వారికందరికీ గర్వకారణం.

.
1847 ఫిబ్రవరి 22 న ఆయన్ని బ్రిటీష్ ప్రభుత్వం ఉరి తీసి,కోయిలకుంట్ల కోట బురుజు పై ఆయన తలను మూడు నెలల పాటు వేలాడదీసిన తర్వాత తెల్లవారితో తలపడేందుకు కొంత కాలం పాటు ఎవరూ సాహసించ లేక పోయారు. ఆయన మరణాంతరం అక్కడి ప్రాంతం లోని ఒక వర్గం ఆయన్ని కీర్తిస్తూ,బుర్ర కథల రూపం లో ఉయ్యాలవాడ ను సజీవంగా నిలిపేందుకు శాయ శక్తులా కృషి చేసింది. ఈ తరుణంలోనే ఆయన సాహసం ఆయనని స్వాతంత్ర్య సమర యోధుడిగా మలచింది. ఏది ఏమైనా ఒకే ఒక్కడు కేవలం పదుల సంఖ్య అనుచర గణంతో వందలాది తెల్ల సైనికులపై దాదాపు 9 నెలల పాటు పోరు కొనసాగించడం అనేది నిజంగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప విశయమే.అయితె గడిచిన ఇన్నేళ్ల కాలంలో ఆయన గురించిన ప్రస్తావన చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే వచిందనేది ఎవరూ కాదనలేని సత్యమ్.ప్రస్తుత తరం లో చాలా మందికి ఆయన గురించిన అవగాహన లేక పోవడానికి ఇది కూడా ఒక కారణం అనే చెప్పుకోవాలి..దాదాపుగా ఆయన పేరు,ఆయన పోరాట పటిమ మసక బారుతున్న నేపథ్యం లో వెండితెర మీద ఆయన జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం జరగడం...ఒక పోరాట యోధునికి అర్పించే నివాళిగా చెప్పుకోవచ్చు..తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆయన చరిత్ర నిలిచిపోయేలా''సై రా నరసింహా రెడ్డి'' చిత్రాన్ని మలిచేందుకు యూనిట్ సమాయత్తమౌతోంది.

 


ఈ సినిమా  రూపకల్పన లో మరో కోణం ఉందా?

ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో జరుగుతున్న హాట్ హాట్ డిస్కషన్ ఇదే...ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ లో రాయలసీమ,తెలంగాణా ప్రాంతాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎక్కువ గా వున్నరు. వాళ్లు తమదనుకుని పార్టీ ఉనికి ప్రశ్నార్ధకమైన నేపథ్యం లో ''ఉయ్యాలవాడ'' ద్వారా తమ అస్తిత్వాన్ని చాటుకుంటూనే...ఆ వర్గం పాలిటిటకల్ ఐడెంటికి ఈ చిత్రం జీవం పోసే అవకాశం ఉందని   గుస గుసలు వినిపిస్తున్నాయి.. సినిమా ప్రభావం ప్రజల మీద అంతో ఇంతో ఉంటుందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అందునా ఒక యోధుడి జీవితాన్ని ఆవిష్కరించే సినిమా కనుక ప్రజలపై,మరీ ముఖ్యంగా తమ సామాజిక వర్గ వోటర్స్ మీద ఉంటుందనేది ఈ వర్గం నాయకుల ఆలోచన గా తెలుస్తోంది...చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం,ఈ సినిమాను  ఎన్నికలకు కొన్ని నెలల ముందు  విడుదల చేసే ఉండటం వల్ల ,  అన్ని రకాలుగా ఇది కలిసి వస్తుందని కాంగ్రెస్ లో ని ఒక వర్గం నాయకులు ఆశిస్తున్నారు.

అయితే సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్తితి.  నాలుగు భాషలలో నిర్మితమయ్యే సినిమా కనుక దాదాపు ఒక సంవత్సరం పాటు పని చేయాల్సి ఉంటుంది.  మెగాస్టార్ చిరంజీవి మదిలో ఏముందో తెలియదు కానీ ఈ డిస్కషన్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది..''అందరి వాడు'' గా పేరున్న చిరు రాజకీయాల్లోకి వచ్చి కొందరివాడు గా మారారు. ఇటీవలే   సినిమా ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అందరివాడు గా తన పూర్వ వైభవాన్ని సాధించుకునే క్రమం లో... మళ్లీ కొందరివాడు అనిపించుకునేందుకు '' సై  రా '' అంటారా??అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.  ఏది ఏమైనా ప్రారంభం నుంచే ఈ సినిమా పై పలురకాల అంచనాలు. విచిత్రం గా వూహకు అందని చర్చలు జరగడం మెగా కాంపౌండ్ లో ఆనందాన్నే నింపుతోంది...ఎందుకంటే..వారికి కావాల్సింది కూడా అదే మరి.

click me!