రావణుడి గురించి అద్భుతంగా చెప్పిన తారక్.. క్యారెక్టర్ పై ఎన్టీఆర్ ఇంత రీసెర్చ్ చేస్తారా.. వీడియో వైరల్

By Asianet News  |  First Published Jun 24, 2023, 2:50 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ రిలీజ్ తర్వాత పలు రకాలుగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతంలో రావణసురుడిగా గురించి జూ.ఎన్టీఆర్ చెప్పిన మాటలు వైరల్ గా మారాయి. 
 


హిందూ పురాణాల్లోని రామాయణం ఆధారం తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్’ థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) సీతారాములుగా నటించారు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో, దేవదత్త హన్మంతుడి పాత్రలో అలరించారు. ఇక బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రను పోషించారు. జూన్ 16న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే విమర్శలను అందుకుంది. రిలీజ్ తర్వాత కూడా పలురకాలుగా వ్యతిరేకతత ఏర్పడింది. 

రామాయణంలోని ప్రధాన పాత్రలను దర్శకుడు ఓం రౌత్ చూపిన తీరుపై ఎక్కువ మేర వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా రావణుడి పాత్రను డిజైన్ చేసిన తీరుకు ప్రేక్షకుల నుంచే కాకుండా అభిమానుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. గతంలో ఎన్నో చిత్రాల్లో రావణుడిని అద్భుతంగా చూపించారని, భారీ బడ్జెట్ తో రూపొందించిన ‘ఆదిపురుష్’లో మాత్రం విఫలయ్యారని మండిపడ్డ విషయం తెలిసిందే.

Latest Videos

అయితే, తాజాగా జూ.ఎన్టీఆర్ రావణసురి పాత్ర గురించి గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ రావణసురుడిపై చేసిన రీసెర్చ్ కు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే సమయంలో ఓం రౌత్ పైనా కాస్తా మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. రావణసురుడి క్యారెక్టర్ గురించి తారక్ చెప్పిన మాటలు ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఆ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 18 లోకాలకు రావణుడు రాజు. అంతేకాదు అసురుల చక్రవర్తి కూడాను. అన్ని లోకాలకు అధిపతి అయ్యారంటే ఆయనకు ఎంతటి నేర్పు, ఎంతటి గంభీరం ఉంటుందో తెలిసి ఉండాలి. ఆయన కళ్లు ఎంత తీక్షణంగా ఉండాలి. ఎవ్వరినైనా కిందనుంచి మీదవరకు మొత్తం స్కాన్ చేయగలగాలి. ఆయన యుద్ధభూమిలో నిలబడితే రాముడే ఓ పద్యాన్ని అందుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయన భక్తితోనూ శివుడినే గడగడలాడించారంటూ చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ ‘జై లవ కుశ’లో రావణుడిగా అలరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ముందుకు ‘అసుర’ అనే పుస్తకాన్ని కూడా చదివానని చెప్పారు.

రావణుడి గురించి ఎన్టీఆర్ చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇలాంటి అంశాలను ఆదిపురుష్ లో కూడా చూపించాల్సి అంటూ అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. ఇన్ని విమర్శల వద్ద కూడా నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.420 కోట్ల వరకు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

 

Sums up his god level performance as Ravana pic.twitter.com/NKsw0FsCjT

— Butcher (@karl__butcher)
click me!