సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబోలోని ‘గుంటూరు కారం’ చిత్రం షూటింగ్ పై తాజాగా అప్డేట్ అందింది. కొద్దిరోజులు షూట్ ఆగగా.. మళ్లీ నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈమేరకు బజ్ వినిపిస్తోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ’గుంటూరు కారం’. ఈ చిత్రం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మహేశ్ బాబు పుట్టిన రోజున ప్రారంభమైన ఈ చిత్రం పలు కారణాలతో ఆలస్యం అవుతూనే వస్తోంది. ఎట్టకేళలకు ప్రారంభమై కొన్ని షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ చిత్ర షూటింగ్ కు ఇటీవల మళ్లీ గ్యాప్ వచ్చింది.
మహేశ్ బాబు, త్రివిక్రమ్ మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్నాయని, అందుకే చివరి షెడ్యూల్ తర్వాత కాస్తా గ్యాప్ వచ్చిందంటూ పుకార్లు వచ్చాయి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ థమన్, పూజా హెగ్దేలు కూడా కొన్ని కారణాలతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారంటూ రూమర్లు వచ్చాయి. దీనిపై యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు. ఇక ఇన్ని వార్తల మధ్య నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.
తాజాగా Guntur Kaaram షూటింగ్ పై అప్డేట్ అందింది. ఈరోజు తదుపరి షెడ్యూల్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరుగుతుందని సమచారం. చిత్రంలోని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారంట. అయితే నవంబర్ వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేయాలని ఇప్పటికే డెడ్ లైన్ కూడా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో షూట్ పున:ప్రారంభం కావడంతో త్వరలోనే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నారు.
ఇక పదేళ్ల తర్వాత మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. దివంగత, సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ కు మాసీవ్ రెస్పాన్స్ వచ్చింది. బాబు మునుపెన్నడూ లేని మాస్ అవతార్ లో దుమ్ములేపబోతున్నాడని అర్థం అవుతోంది. చిత్రంలో శ్రీలీలా కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే సంయుక్త మీనన్ పేరు కూడా వినిపిస్తోంది. హారికా అండ్ హాసిని బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 13న గ్రాండ్ రిలీజ్ కు షెడ్యూల్ చేశారు.