పవర్ స్టార్ పవన్ కళ్యాన్ , కమెడియన్ అలీ బంధం మళ్లీ బలపడుతుందా..? గత కొన్ని సినిమాలకు కొనసాగుతున్న గ్యాప్ మల్ళీ పుల్ అవ్వనుందా.. ? పవన్ సినిమాలో అలీ అన్న వార్తల్లో నిజమెంత...?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ జోడీగా.. సాహో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఓజి. ఈ సినిమాపై రోజుకో బజ్ వినిపిస్తుంది. ఈక్రమంలో ఈసినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేని పోర్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై ఇప్పటికే భారీగా హైప్ క్రియేట్ అయ్యింది.
ఇక ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా.. ఓజీకి సబంధించిన ఓన్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది.
ఈసినిమాలో ఓ క్రేజీ రోల్ కోసం స్టార్ సీనియర్ కమెడియన్ అలీని తీసుకున్నట్టు తెలుస్తోంది. అలీ పపర్ స్టార్ పవన్ కళ్యాన్ ప్రతీ సినిమాలో ఉంటాడు. కాని గత కొంత కాలంగా పవర్ కళ్యాణ్ సినిమాల్లో ఆయన కనిపించడంలేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. పవర్ స్టార్ జనసూన పార్టీ అదినేతగా ఉండగా.. అలీ మాత్రం వైసీపీలో కీలక పదవిలో ఉన్నారు.
రాజాయాల పరంగా వీరి మధ్య కాస్త దూరం పెరిగినట్టు తెలుస్తోంది. అదే ప్రభావం ప్రస్తుతం సినిమాల మీద కూడ పడినట్టు సమాచారం. అందుకే ఇప్పటి వరకూ పవన్ సినిమాలో క్యారెక్టర్ మిస్ అవ్వని అలీకి.. వకీల్ సాబ్ సినిమా దగ్గర నుంచి అసలు పిలుపే రావడం లేదట. ఇక తాజాగా ఓజీ సినిమాలో అలీ అంటూ వస్తున్న వార్తల్లో కూడా ఎంత వరకూ నిజం ఉన్నది అనేది మాత్రం తెలియడం లేదు. ఈ విషయంలో... అఫీషియల్ గా ప్రకటన వస్తే కాని ఏం చెప్పలేదు. ఇప్పటి వరకూ అయితే ఇది రూమర్ గానే మిగిలిపోనుంది.
ఇక మరో విషయం ఏంటంటే.. ఈసినిమాలో అలీని తీసుకోవాలి అనుకున్న పాత్రలో మరో స్టార్ కమెడియన్ ను తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈమూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు టీమ్. ప్రభాస్ తో పాన్ ఇండియా రేంజ్ లో సాహో తెరకెక్కించిన సుజిత్ ను నమ్మి ఈసినిమా చేస్తున్నాడు పవర్ స్టార్. మరి ఈసినిమా ఆడియన్స్ ను ఎంత వరకూ ఆకట్టుకుంటుందో చూడాలి మరి.