ఆస్కార్‌ ఉత్తమ చిత్రం `నోమడ్లాండ్‌`.. అన్నీ కోల్పోయిన మహిళా జర్నీ

By Aithagoni RajuFirst Published Apr 26, 2021, 9:04 AM IST
Highlights

ఆస్కార్‌ ఉత్తమ చిత్రంగా `నోమడ్లాండ్‌` నిలిచింది.  క్లోయి జావో దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిరుడు ఫిబ్రవరిలో విడుదలై ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. కానీ ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్‌ పురస్కారాల్లో మాత్రం సత్తా చాటింది.

ఆస్కార్‌ ఉత్తమ చిత్రంగా `నోమడ్లాండ్‌` నిలిచింది. ఉత్తమ దర్శకురాలిగా అకాడమీ అవార్డుని అందుకున్న క్లోయి జావో దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిరుడు ఫిబ్రవరిలో విడుదలై ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. కానీ ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్‌ పురస్కారాల్లో మాత్రం సత్తా చాటింది. ఈ సినిమా ఉత్తమ దర్శకురాలు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి,  అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫీ విభాగాల్లో ఆస్కార్‌కి నామినేట్‌ అయ్యింది. ఇప్పటికే దర్శకురాలిగా క్లోయి జావో అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ఉత్తమ చిత్రంగా ఈ సినిమా నిలవడం విశేషం. 

60ఏళ్ల ఓ మహిళా తన జీవితంలో అన్నీ కోల్పోతుంది. అనంతరం ఆమె సంచార జీవిగా జీవించడం స్టార్ట్ చేస్తుంది. ఓ రకంగా ఆమెకిది సెకండ్‌ లైఫ్‌ అని చెప్పొచ్చు. ఈ జర్నీని ఆమె చూసిన అనుభవాలు, తెలుసుకున్న విషయాల, పడ్డ ఇబ్బందులు వంటి అద్భుతమైన జర్నీని తెలిపే కథతో క్లోయి జావో ఈ సినిమాని రూపొందించారు. ఆద్యంత నాటకీయంగా ఈ చిత్రం సాగుతూ ఆకట్టుకుంటుంది. ఇక ఇందులో 60ఏళ్ల మహిళగా ఆస్కార్‌ విన్నింగ్‌ అమెరికన్‌ నటి ఫ్రాన్సెస్‌ మెక్‌ డోర్మాండ్‌ నటించడం విశేషం. బహుశా ఆమె కూడా ఉత్తమ నటిగా ఆస్కార్ దక్కించుకున్నా ఆశ్చర్యం లేదు. 

ఇక ఈ సినిమా ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక బ్రిటీష్‌ అకాడమీ అవార్డులు, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌ పురస్కారాలు, ఉత్తమ నటిగా గోల్డెన్ గ్లోబ్‌ పురస్కారం వంటివి వరించాయి. ఈ సినిమాకి క్లోయి జావోనే రైటర్‌, డైరెక్టర్‌, ఎడిటర్‌, ప్రొడ్యూసర్‌ కావడం విశేషం.  

click me!