గ్రాండ్‌గా ప్రారంభమైన ఆస్కార్‌ అవార్డు వేడుక.. ఉత్తమ దర్శకురాలిగా క్లోయి జావో..

By Aithagoni RajuFirst Published Apr 26, 2021, 8:02 AM IST
Highlights

ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల వేడుక ప్రారంభమైంది. 25సాయంత్రం(మనకు 26) నుంచి ఈ పురస్కార ప్రదాన వేడుక జరుగుతుంది. ప్రపంచంలోనే సినిమాకి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పురస్కారాల వేడుక హాలీవుడ్‌ వేదిక అవుతుంది. 

ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల వేడుక ప్రారంభమైంది. 25సాయంత్రం(మనకు 26) నుంచి ఈ పురస్కార ప్రదాన వేడుక జరుగుతుంది. ప్రపంచంలోనే సినిమాకి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పురస్కారాల వేడుక హాలీవుడ్‌ వేదిక అవుతుంది. లాస్‌ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్లో రెగ్యూలర్‌గా జరుగుతుంటాయి. కానీ కరోనా ఎఫెక్ట్ తో ఈ సారి డాల్బీ థియేటర్‌తోపాటు డౌన్‌టౌన్‌లోనూ జరుగుతున్నాయి. రెజినా కింగ్‌ హోస్ట్ గా ఈ వేడుక స్టార్ట్ అయ్యింది.

ఉత్తమ డైరెక్టర్‌గా చైనీస్‌-అమెరికన్‌ ఫిల్మ్ మేకర్‌ క్లోయి జావో ఆస్కార్‌ అవార్డుని అందుకున్నారు. `నోమాడ్‌ల్యాండ్‌` అనే డ్రామా చిత్రానికి గానూ ఆమెకి ఈ పురస్కారం వరించింది. ఈ సినిమాకి క్లోయిజావో కేవలం దర్శకురాలు మాత్రమే కాదు రైటర్‌, ఎడిటర్‌, ప్రొడ్యూసర్‌ కూడా. ఇప్పటికే ఈ సినిమాకి అనేక అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. ఉత్తమ దర్శకురాలిగా బ్రిటీష్‌ అకాడమీ అవార్డు వరించింది. ఇదిలా ఉంటే ఉత్తమ దర్శకురాలు విభాగంలో అవార్డు అందుకున్న రెండో మహిళా దర్శకురాలు క్లోయి జావో కావడం విశేషం.  మొదటగా 2009లో `ది హర్ట్ లాకర్‌` అనే చిత్రానికి కత్రిన్‌ బిగెలో అవార్డు అందుకున్నారు.

దీంతోపాటు ఉత్తమ సహాయ నటుడిగా డానియెల్‌ కలూయ `జుడాస్‌ అండ్‌ ది బ్లాక్‌ మెస్సయ్య` చిత్రానికి అవార్డు అందుకున్నారు.  ఉత్తమ సహాయ నటిగా సౌత్‌ కొరియన్‌కి చెందిన 74ఏళ్ల మహిళ నటి యు జంగ్‌ యూన్‌ `మిన్నారి` చిత్రానికి పురస్కారం దక్కించుకున్నారు. బెస్ట్ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే  విభాగంలో ఎమెరాల్డ్ ఫెన్నెల్‌ అవార్డు దక్కించుకున్నారు. `ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌` చిత్రానికి గానూ ఆమెకి అవార్డు దక్కింది. 

click me!