సహాయ నటిగా 74ఏళ్ల యూ యు జంగ్‌.. ఆస్కార్‌ అందుకున్న తొలి మహిళా నటి

By Aithagoni RajuFirst Published Apr 26, 2021, 8:30 AM IST
Highlights

2020లో విడుదలైన సినిమాలకు అందించే ఈ పురస్కారాల విన్నర్స్ లో ఊహించని విధంగా ఈ సారి మహిళలు సత్తా చాటడం విశేషం. సహాయ నటిగా యూ యు జంగ్‌ సరికొత్త రికార్డు సృష్టించారు.

93వ అకాడమీ అవార్డు వేడుక వైభవంగా జరుగుతుంది. లాస్‌ ఏంజెల్స్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకలో పలు సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. 2020లో విడుదలైన సినిమాలకు అందించే ఈ పురస్కారాల విన్నర్స్ లో ఊహించని విధంగా ఈ సారి మహిళలు సత్తా చాటడం విశేషం. ఉత్తమ దర్శకురాలిగా క్లోయి జావో ఎంపికయ్యారు. ఆమె అవార్డు అందుకున్న రెండో దర్శకురాలు కావడం విశేషం. అలాగే బెస్ట్ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లేలోనూ మహిళా రైటర్‌ ఎమెరాల్డ్ ఫెన్నెల్‌కి అవార్డు వరించింది. 

ఇక ఉత్తమ సహాయ నటి విభాగంలోనూ మహిళే కావడం విశేషం. సౌత్‌ కొరియాకి చెందిన యూ జంగ్‌ యూన్‌ అనే నటి ఆస్కార్‌ అవార్డు అందుకున్నారు. 74ఏళ్ల వయసులో ఆమె ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోవడం ఓ విశేషమైతే, సౌత్‌ కొరియా నుంచి నటి విభాగంలో అవార్డు అందుకున్న తొలి మహిళా నటి కావడం మరో విశేషం. అంతేకాదు, ఆస్కార్‌కి నామినేట్‌ అయిన ఫస్ట్ టైమే ఆమె అవార్డును కొల్లగొట్టడం సంచలనంగా మారింది. 74ఏళ్ల వయసులో ఆమెకి పురస్కారం వరించడం విశేషంగా చెప్పుకోవచ్చు. `మిన్నారి` చిత్రానికి గాను అవార్డు అందుకున్నారు. ఇందులో ఆమె బామ్మగా అద్భుతమైన నటనని పలికించారు. ఆస్కార్‌ జ్యూరీని ఫిదా చేశారు. 

click me!