లిప్ లాక్ అంటే ఆ హీరోతోనే చేస్తా.. తమన్నా!

Published : Mar 02, 2019, 10:44 AM ISTUpdated : Mar 02, 2019, 10:46 AM IST
లిప్ లాక్ అంటే ఆ హీరోతోనే చేస్తా.. తమన్నా!

సారాంశం

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా వెండితెరపై ముద్దు సీన్లలో మాత్రం నటించనని చెబుతోంది. ఇప్పటివరకు తాను పని చేసిన సినిమాలకు ఇదే షరతులు విధించినట్లుగా చెప్పింది.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా వెండితెరపై ముద్దు సీన్లలో మాత్రం నటించనని చెబుతోంది. ఇప్పటివరకు తాను పని చేసిన సినిమాలకు ఇదే షరతులు విధించినట్లుగా చెప్పింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో లిప్ లాక్స్ అనేవి కామన్ అయిపోయాయి.

'అర్జున్ రెడ్డి' సినిమా వచ్చిన తరువాత టాలీవుడ్ లో లిప్ లాక్ సన్నివేశాలు మరింత ఎక్కువయ్యాయి. ఇక బాలీవుడ్ సంగతి చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో తమన్నా మాత్రం ఆన్ స్క్రీన్ ముద్దు సీన్లలో నటించనని అంటోంది.

అయితే ఒక హీరోతో మాత్రం లిప్ లాక్ సీన్స్ లో నటిస్తానని చెప్పడం గమనార్హం. ఆ హీరో మరెవరో కాదూ బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్. అతడితో సినిమా చేసే ఛాన్స్ వస్తే గనుక తెర మీద ముద్దులు పెట్టుకోవడానికి కూడా వెనుకాడనని అంటోంది.

హ్రితిక్ అంటే తనకు ఎంతో అభిమానమని, అతడితో నటించే ఛాన్స్ వస్తే చాలాని చెప్పింది. కొంతకాలం క్రితం హ్రితిక్ ని చూసినప్పుడు తమన్నాకి అసలు మాటలే రాలేదట. చివరకు అతడి దగ్గరకి వెళ్లి 'నేను మీకు పెద్ద ఫ్యాన్' అని చెప్పిందట. 
 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌