నివేదా బంపర్‌ ఆఫర్‌.. సూపర్‌ స్టార్‌తో రొమాన్స్?

Published : Jun 03, 2021, 01:47 PM IST
నివేదా బంపర్‌ ఆఫర్‌.. సూపర్‌ స్టార్‌తో రొమాన్స్?

సారాంశం

ఇందులో ఇద్దరు హీరోయిన్లని తీసుకోబోతున్నారని, అందులో ఓ హీరోయిన్‌గా నివేదాని ఫైనల్‌ చేశారని సమాచారం. అయితే మరో హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామలపై దృష్టి పెట్టారట త్రివిక్రమ్‌. 

టాలెంటెడ్‌ బ్యూటీ నివేదా థామస్‌ బంపర్‌ ఆఫర్‌ అందుకుంది. బిగ్‌ సూపర్‌ స్టార్‌తో నటించే ఆఫర్‌ని దక్కించుకుంది. ఫస్ట్ టైమ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇందులో ఇద్దరు హీరోయిన్లని తీసుకోబోతున్నారని, అందులో ఓ హీరోయిన్‌గా నివేదాని ఫైనల్‌ చేశారని సమాచారం. అయితే మరో హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామలపై దృష్టి పెట్టారట త్రివిక్రమ్‌. 

కియారా అద్వానీ, జాన్వీ కపూర్‌, దిశా పటానీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని ఫైనల్‌ చేస్తారనేది తెలియాల్సి ఉంది. మరి మెయిన్‌ లీడ్‌గా వీరిలో ఒకరిని ఫైనల్‌ చేస్తారని, నివేదా సెకండ్‌ హీరోయిన్‌గా కనిపిస్తుందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. జనరల్‌గా త్రివిక్రమ్‌ సినిమాల్లో మెయిన్‌ ఫీమేల్‌ లీడ్‌ ఒకరు, సెకండ్‌ హీరోయిన్‌ మరొకరు ఉంటారు. మహేష్‌తోనూ అదే ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారట. 

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి `పార్థు` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. `అతడు` సినిమాలో మహేష్‌ పాత్ర పేరు పార్థు అనే విషయం తెలిసిందే. అదే లేటెస్ట్ సినిమాకి టైటిల్‌ అనుకుంటున్నారని సమాచారం. ఇక `అతడు`, `ఖలేజా` చిత్రాల తర్వాత మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతుంది. త్వరలోనే ఇది రెగ్యూలర్‌ షూటింగ్‌ని ప్రారంభించుకోనుంది. ఇక ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించబోతున్నారు. నివేదా ఇటీవల `వకీల్‌సాబ్‌` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా