గంగవ్వ సొంతింటి కల నెరవేరినట్లే... నిర్మాణం ఎంత వరకు వచ్చిందంటే!

By team teluguFirst Published Jun 3, 2021, 1:39 PM IST
Highlights

కొద్ది నెలల క్రితం మొదలైన గంగవ్వ ఇల్లు నిర్మాణం చివరి దశకు వచ్చినట్లు తెలుస్తుంది. నిర్మాణ పనులు జరుగుతున్న తన ఇంటి ముందు నిల్చొని ఫోటో దిగి, ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది గంగవ్వ. 
 

సోషల్ మీడియా సెలబ్రిటీ, బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ సొంత ఊరిలో కొత్త ఇల్లు నిర్మించుకుంటున్న విషయం తెలిసిందే. శిథిలావస్థకు చేరిన పాత ఇంటిని కూల్చి అదే స్థలంలో గంగవ్వ కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. దాదాపు రూ. 20లక్షల వ్యయంతో తన ఇంటి నిర్మాణం చేపట్టినట్లు గంగవ్వ స్వయంగా చెప్పారు. కొద్ది నెలల క్రితం మొదలైన గంగవ్వ ఇల్లు నిర్మాణం చివరి దశకు వచ్చినట్లు తెలుస్తుంది. నిర్మాణ పనులు జరుగుతున్న తన ఇంటి ముందు నిల్చొని ఫోటో దిగి, ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది గంగవ్వ. 


మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా సామాన్యురాలైన గంగవ్వ సూపర్ పాప్యులర్ అయ్యారు. అదే పాపులారిటీ బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించే అవకాశం తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ తక్కువ రోజులే ఉన్నారు. ఆరోగ్య కారణాలతో హౌస్ నుండి స్వచ్ఛందంగా బయటకు వచ్చారు ఆమె. హౌస్ లో ఉన్నన్నాళ్ళు ప్రేక్షకులకు మస్త్ మజా పంచారు గంగవ్వ. 


టైటిల్ గెలిచి వస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పిన గంగవ్వ సొంత ఇంటికి కావలసిన డబ్బులు గెలుచుకోకుండానే బయటికి వచ్చేశారు. అయితే నీ సొంత ఇంటికి కలను నేను సాకారం చేస్తానని, కింగ్ నాగార్జున గంగవ్వ ఇంటి నిర్మాణాకి కావలసిన మొత్తంలో చాలా వరకు ఏర్పాటు చేశారు. అలా గంగవ్వ హంగులతో అందమైన చక్కని ఇంటిని నిర్మించుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గంగవ్వకు మంచి పాపులారిటీ ఉంది.
 

click me!