
హీరో నిఖిల్ సిధార్థకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. ఆయన నిబంధనలు పాటించలేదంటూ చలానా విధించారు. నిఖిల్ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు, ఆయన కార్ నంబర్ ప్లేట్ నిబంధనలకు తగ్గట్లుగా లేదనే రెండు కారణాల క్రింద రెండు చలాన్లు విధించారు. లాక్ డౌన్ నియమాలు పాటించ కుండా కర్ఫ్యూ సమయంలో నిఖిల్ కారు రోడ్లపైకి వచ్చిన కారణంగా పోలీసులు అపరాధ రుసుం విధించారు.
అయితే పోలీసులు నిఖిల్ కారుకు చలాన్లు విధించే సమయంలో ఆయన కారులో లేరని సమాచారం. తెలంగాణాలో లాక్ డౌన్ కొనసాగుతుంది. పరిమిత సమయం వరకే వాహనాలు, ప్రజలను బహిరంగ ప్రదేశాలలోకి అనుమతిస్తున్నారు. తెలంగాణాలో లాక్ డౌన్ జూన్ 9వరకు కొనసాగుతుంది.
మరోవైపు నిఖిల్ తన బర్త్ డే కానుకగా లేటెస్ట్ మూవీ 18పేజెస్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అనుపమ పరమేశ్వరన్ తో కూడిన 18 పేజెస్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. 18పేజెస్ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 మూవీ చేస్తున్నారు నిఖిల్. ఈ మూవీ కార్తికేయ మూవీకి సీక్వెల్ కాగా, చిత్రీకరణ జరుపుకుంటుంది.