
యంగ్ హీరో నితిన్ ప్రేమలో పడ్డాడా? మరి అలాంటిదేం లేకుండానే తనపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయా... ఎందుకంటే తన సహనటితో నితిన్ రొమాన్స్ చేస్తున్నాడనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంట్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం వీళ్ల గురించిన మేటర్ తెగ హల్‌చల్ చేస్తోంది. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండే నితిన్.. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తరహాలోనే మిగతా వ్యవహారల్లో వేలు పెట్టని ఈ యంగ్ హీరో ‘లై’ హీరోయిన్ మేఘా ఆకాశ్‌తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
‘లై’ షూటింగ్ టైంలో వీరి మధ్యనున్న పరిచయం ప్రేమకు దారి తీసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ ప్రేమలోకంలో విహరిస్తున్నారట. త్వరలోనే పెళ్లాడాలనే యోచనలో కూడా ఈ జంట ఉన్నట్లు గాసిప్‌లు వినిపిస్తున్నాయి. నితిన్‌తో లవ్ కారణంగానే ఆమె సినిమా ఛాన్స్‌లు కూడా వద్దనుకుంటోందట. రామ్ సినిమాతో సినిమాను కూడా ఒప్పుకోకపోవడానికి అదే కారణమని తెలుస్తోంది.
కాకపోతే.. అటు నితిన్ గానీ, ఇటు మేఘా ఆకాశ్ గానీ ఈ వార్తపై నోరు మెదపడం లేదు. ఇప్పుడామె నితీన్ ఆమె సరసన కలిసి నటిస్తోంది. తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ.. ఆ రెండూ చాలా కాలం కిందటే ఒప్పుకున్న సినిమాలట. మరి ఈ లవ్ వ్యవహారం విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో.