నితిన్ కి హీరోయిన్ దొరికిందా.. రష్మికని రీప్లేస్ చేసేది ఆమేనా ?

By tirumala ANFirst Published Apr 19, 2024, 4:52 PM IST
Highlights

నితిన్.. తనకి భీష్మ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రాబిన్ హుడ్ అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం నితిన్ వరుస చిత్రాల్లో క్రేజీ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నాడు. వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్.. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

అదే సమయంలో నితిన్.. తనకి భీష్మ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రాబిన్ హుడ్ అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. రాబిన్ హుడ్ చిత్రం డిసెంబర్ 20న క్రిస్టమస్ కానుకగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే సంగతి ఇంకా తెలియలేదు. 

వాస్తవానికి భీష్మ కాంబినేషన్ రష్మిక మందన హీరోయిన్ గానే ఈ చిత్రాన్ని ప్రారంభించారు. కానీ కొన్ని కారణాల వల్ల రష్మిక ఈ చిత్రం నుంచి తప్పుకుంది. ఆ తర్వాత కొత్త హీరోయిన్ ఎవరనే విషయాన్ని చిత్ర యూనిట్ ఇంతవరకు ప్రకటించలేదు. 

తాజాగా ఈ మూవీలో హీరోయిన్ విషయంలో క్రేజీ రూమర్స్ వస్తున్నాయి. ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. నితిన్, రాశి ఖన్నా ఆల్రెడీ శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటించారు. ఆయా మూవీ అంత గొప్పగా ఆడలేదు. 

ఇప్పుడు వీళ్ళిద్దరూ మరోసారి రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు టాక్. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రష్మిక ఎగ్జిట్ తర్వాత శ్రీలీల పేరుకూడా వినిపించింది. ఇప్పుడు రాశి ఖన్నా కన్ఫర్మ్ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

click me!