నితిన్ 'ఎగస్ట్రా' అంటున్న దర్శకుడు?

Published : Jun 22, 2023, 05:09 PM IST
నితిన్  'ఎగస్ట్రా' అంటున్న దర్శకుడు?

సారాంశం

ఇండియా' సినిమా చేసిన వక్కంతం, చాలా గ్యాప్ తరువాత మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు. కథా రచయితగా మంచి పేరున్న వంశీపై నమ్మకంతో నితిన్ ఛాన్స్ ఇచ్చాడు.   


నితిన్ కు కెరీర్ ప్రారంభం నుంచి అప్ అండ్ డౌన్సే. కొంతకాలం వరస డిజాస్టర్స్..ఆ తర్వాత హిట్స్..మళ్లీ కెరీర్ ట్రాక్ లో పడిందనగానే ప్లాఫ్ లు ప్రారంభం. ఈ క్రమంలో  గత కొంతకాలంగా నితిన్ కెరియర్లో ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ సినిమా కూడా లేదు. ఈ మధ్యనే "మాచర్ల నియోజకవర్గం" సినిమాతో ప్రేక్షకుల మందికి వచ్చారు నితిన్.  ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.  ఈ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమాని మొదలు పెట్టారు. రచయిత గా మంచి పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ అల్లు అర్జున్ హీరోగా నటించిన "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" సినిమాతో దర్శకుడిగా మారారు. 

కానీ మొదటి సినిమాతో అంతగా మెప్పించలేకపోయారు. నితిన్ తో సినిమా మొదలెట్టారు. కానీ ఆ సినిమా కూడా ముందుకు, వెనక్కి అన్నట్లు ప్రారంభమై చాలా కాలం అయినా కదలిక లేదు. అవన్ని ప్రక్కన పెట్టి అసలు విషయానికి వస్తే..ఈ సినిమాకు 'ఎగస్ట్రా' అని కానీ...  'ఎగస్ట్రా-ఆర్టినరీమాన్' అని గానీ  టైటిల్స్ ను  పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి 'ఎగస్ట్రా' అనే టైటిల్ ను సెట్ చేశారట. ట్యాగ్ లైన్ గా 'ఆర్డినరీ మేన్' అనేది ఉంటుంది. అంటే మొత్తంగా చూసుకుంటే 'ఎక్స్ ట్రార్డినరీ మేన్'గా అనిపిస్తుందన్న మాట. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి టైటిల్ కూడా డిఫరెంట్ గానే ఉండేలా ఇలా ప్లాన్ చేశారని అంటున్నారు.

అంతకు ముందు ఈ చిత్రానికి జూనియర్ అని టైటిల్ పెట్టారు. కానీ అది పెద్దగా ఆసక్తి కలిగించలేదని ఈ ఎగస్ట్రా అని వచ్చేలా టైటిల్ పెడుతున్నట్లు సమాచారం. సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా వేషాలు వేసే ఓ వ్యక్తి కథ అని, ఫన్ తో యాక్షన్ కలిసి ఉంటుందని చెప్తున్నారు. 

ఇక  వక్కంతం వంశీ సినిమాతో అయినా హిట్ కొట్టాలని ఫిక్స్ అయిన నితిన్ స్క్రిప్ట్ లో బోలెడు మార్పులు చేర్పులు చెప్పారని వార్తలు వచ్చాయి. ఇక నితిన్ చెప్పిన మార్పులన్నీ చేసిన తర్వాత వక్కంతం వంశీ మళ్లీ కథ వినిపించగా నితిన్ కూడా వెంటనే ఓకే చెప్పేసారట. డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకోలేకపోయినప్పటికీ వక్కంతం వంశీకి రైటర్ గా మంచి అనుభవం ఉంది. రైటర్ గా "కిక్", "టెంపర్" వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. ఇక నితిన్ సినిమాతో దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు.
 
 

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది