నోరు జారిన బాలయ్య.. శ్రీలీల గురించి ఆ సీక్రెట్ లీక్, వెంటనే తేరుకుని నోటికి తాళం

Published : Jun 22, 2023, 04:45 PM IST
నోరు జారిన బాలయ్య.. శ్రీలీల గురించి ఆ సీక్రెట్ లీక్, వెంటనే తేరుకుని నోటికి తాళం

సారాంశం

వీర సింహారెడ్డి గర్జన తర్వాత బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భగవంత్ కేసరి'. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తొలిసారి బాలయ్యని డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఇది. ఇటీవల బాలయ్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ అద్భుతంగా వర్కౌట్ అయింది. 

వీర సింహారెడ్డి గర్జన తర్వాత బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భగవంత్ కేసరి'. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తొలిసారి బాలయ్యని డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఇది. ఇటీవల బాలయ్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. 

నేడు బాలకృష్ణకి చెందిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 23వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బాలయ్య పాల్గొన్నారు. బాలయ్య తో పాటు పివి సింధు, హీరోయిన్ శ్రీలీల అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాలయ్య ప్రసంగిస్తూ శ్రీలీల గురించి పొరపాటున నోరు జారారు. 

దీనితో భగవంత్ కేసరి చిత్రంలోని చిన్న సీక్రెట్ లీక్ అయింది. శ్రీలీల బిజీగా గడుపుతోంది అని చెబుతూ.. మా శ్రీలీల ఉంది.. ఉదయాన్నే మా సినిమా భగవంత్ కేసరిలో ఫైట్స్ చేసి ఇక్కడికి వచ్చింది అని పొరపాటున బాలయ్య చెప్పడం విశేషం. వెంటనే తేరుకుని రేపు మీరు చూసారుగా సినిమాలో అంటూ నోటికి తాళం వేసుకున్నారు. 

క్యూట్ గా హాట్ గా మాయ చేస్తున్న శ్రీలీల అందంగా కనిపిస్తే చూడాలని యువత కోరుకుంటారు. ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో టాప్ లీగ్ లో కొనసాగుతున్న హీరోయిన్. అలాంటి హీరోయిన్ చేత అనిల్ రావిపూడి యాక్షన్ సీన్స్ చేస్తున్నాడు అంటే సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. 

భగవంత్ కేసరి చిత్రంలో బాలయ్య తొలిసారి తెలంగాణ యాసలో నటిస్తున్నారు. అనంతరం శ్రీలీల మాట్లాడుతూ.. కేన్సర్ ఆసుపత్రి కావడంతో తాను కూడా డాక్టర్ చదువుతున్న విషయాన్ని గుర్తు చేసుకుంది. కాలేజీలో కేన్సర్ విభాగం అంటే మా ఫ్రెండ్స్ చాలా భయపడేవారు. కానీ ఇంతమంది డాక్టర్లు ఇక్కడ కేన్సర్ వ్యాధికి చికిత్స అందిస్తున్నారు అంటే గొప్ప విషయం. 

భగవంత్ కేసరి చిత్ర షూటింగ్ లో ఒక ఆసక్తికర ఇన్సిడెంట్ జరిగింది. నాకు కేర్ టేకర్ పాత్రలో నటిస్తున్న పెద్దావిడ ఒక రోజు ఎమోషనల్ గా కనిపించింది. ఎందుకు అలా కన్నీరు పెట్టుకుంటున్నారు అని అడిగితే భాదతో కాదు.. సంతోషంతో అని చెప్పింది. నాకు కేన్సర్ వచ్చినప్పుడు మా ఫ్యామిలీ కూడా హెల్ప్ చేయలేకపోయింది. కానీ బసవతారకం ఆసుపత్రి ద్వారా చికిత్స పొంది నేను మళ్ళీ సినిమాల్లో నటించగలుగుతున్నా అని చెప్పిందని శ్రీలీల వేదికపై తెలిపింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?