
త్వరలో రామాయణ గాథ ఆధారంగా మరో సినిమా తెరపైకి రానున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్ హీరోగా రూపొందిన `దంగల్` సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న నీతీష్ తివారి ఈ భారీ సినిమాకు శ్రీకారం చుట్టాలని ప్లాన్ చేస్తున్నారు. దంగల్, చిచోరే.. లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ నితేశ్ తివారి రీసెంట్ గా రామాయణం తీస్తానని ప్రకటించగానే మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది ట్రేడ్ లో .
రణబీర్ కపూర్ రాముడిగా, అలియా భట్ సీతగా తెరకెక్కిస్తానని ప్రకటించారు. మందు మంతెన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో సౌత్ యాక్టర్స్ ని కూడా తీసుకునే ఛాన్సులు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే తాజాగా ఆదిపురుష్ సినిమా సరిగ్గా తీయలేదని ఇష్యూ నడుస్తున్న నేపధ్యంలో ఈ సినిమాపైనా అందరి దృష్టీ పడింది. అదే సమయంలో ఈ సినిమాపై అప్పుడే విమర్శలు,ట్రోలింగ్ మొదలయ్యాయి.
రణబీర్ కపూర్, అలియా భట్ ఇద్దరూ దైవత్వం తో కూడిన రాముడు,సీత పాత్రలకు పనికిరారు అని అంటున్నారు. ముఖ్యంగా రణబీర్ ని ఈ పాత్రకు ఎంపిక చేయటం పట్ల విమర్శలు వస్తున్నాయి. గతంలో ఎప్పుడో తాను భీఫ్ తింటానని ఓ ఇంటర్వూలో చెప్పిన రణబీర్ ..రాముడు పాత్రకు ఎలా తీసుకుంటారని ప్రశ్నస్తున్నారు. అలాగే గంగూబాయి కతియావాడి వంటి వేశ్య పాత్రలు చేసిన అలియా భట్ ని పవిత్రమమైన సీత అమ్మవారు పాత్రలో ఎలా చూపిస్తారు అంటున్నారు. ఓ ప్రక్కన ఆదిపురుష్ చిత్రంపై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్ చూస్తూ కూడా ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారని దర్శకుడు నితేష్ తివారి అడుగుతున్నారు.
ఇదిలా ఉండగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆదిపురుష్ దర్శకుడు ఓంరౌత్ ని నితీశ్ తివారి తీసే రామాయణం గురించి అడిగారు. నితేశ్ తివారి తీసే రామాయణం పై ఓం రౌత్ మాట్లాడుతూ.. నితేశ్ తివారి గొప్ప దర్శకుడు. నాకు మంచి స్నేహితుడు కూడా. అతని దంగల్ సినిమా మన దేశ అత్యుత్తమ చిత్రాల్లో ఒకటి. నితేశ్ రచనలు, దర్శకత్వం అద్భుతంగా అంటుంది. నితేశ్ రామాయణంపై సినిమా తీస్తాను అని ప్రకటించారు. అందరి రామ భక్తులలాగే నేను కూడా నితేశ్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. రాముడిపై ఎవరైనా, ఎన్ని సినిమాలైనా తీయొచ్చు. రాముడి కథను ఎక్కువ మంది చెప్తే ఇంకా మంచిది. నితేశ్ తీసే రామాయణం కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను అని వ్యాఖ్యానించారు.
మధు మంతెన, మరికొంత మంది బాలీవుడ్ మేకర్స్‌తో కలిసి అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించాలని ప్లాన్ చేసారు. కరోనాకి ముందే ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించారు కూడా. అయితే ఇంత వరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు. అయితే తాజాగా ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, అలియాభట్, హృతిక్ రోషన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం మొదలవడంతో మరోసారి నితీష్ తివారి `రామాయణం` వార్తల్లో నిలిచింది. అయితే అల్లు అరవింద్ ఈ రామాయణం ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్నారో లేదో తెలియదు.
ప్రస్తుతం నితీష్ తివారి యంగ్ జోడీ వరుణ్ ధావన్, జాన్వీ కపూర్‌లతో `బవల్` మూవీని తెరకెక్కిస్తుంచారు. ఈ సినిమా డైరక్ట్ ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం `రామాయణం`పైనే దృష్టి పెట్టారని సమాచారం.