గుంటూరు కారం మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియోకి తమన్ ఇచ్చిన బీజీఎం కాపీ అని నెటిజన్స్ ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. ఈ లోగా ఏమైందో ఏమో ..
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ముందు వరుసలో ఉంటారనే సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ తో చేసిన అల..వైకుంఠపురములో’ తర్వాత తమన్ నెక్ట్స్ లెవిల్ కు వెళ్లిపోయాడు. దేవి శ్రీ ప్రసాద్ కు ఓ రేంజిలో పోటీ ఇవ్వటమే కాదు ఓ టైమ్ లో అతనిపై పై చేయి సాధించాడు. అయితే తమన్ ని ఓ సమస్య వెంటాడుతోంది. అతను వరస ప్రాజెక్టులు ఒప్పుకుని, సరైన టైమ్ కు డెలవరీ చేయలేకపోతన్నారు. అలాగే తమన్ పై మాత్రం కాపీ ముద్ర చెదరడం లేదు. చాలా సార్లు తను ఇచ్చిన ట్యూన్స్ ని కాపీ కొట్టడం, లేదా తమిళ సినిమాల్లోని పాటలను, బీజీఎంను కాపీ చేస్తాడని తమన్‌పై ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో ఇప్పుడు మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ విషయంలో కూడా తమన్ కాపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గుంటూరు కారం మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియోకి తమన్ ఇచ్చిన బీజీఎం కాపీ అని నెటిజన్స్ ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. ఈ లోగా ఏమైందో ఏమో ..తమన్ కు ఈ ప్రాజెక్టు నుంచి బయిటకు పంపి, అనిరుధ్ ని సీన్ లోకి తెచ్చాడంటున్నారు. విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలో అనిరుధ్ ఇచ్చిన ఒక ట్యూన్ అచ్చం ఇలానే ఉండటమే కారణం అంటున్నారు. అయితే అఫిషియల్ సమాచారం ఏమీ లేదు. మరి దీనిపై తమన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
ఇదిలా ఉంటే తమన్ సినిమా నుంచి వైదొలగినట్లు వస్తున్న వార్తల నేపధ్యంలో అందరూ ఎవరికి తోచినట్టువారు రీజన్స్ చెబుతున్నారు. కానీ మహేశ్ బాబుతో విబేదాల కారణంగానే తమన్‌ను తప్పించినట్టు ప్రధానంగా విన్పిస్తోంది. గుంటూరు కారం సినిమా సంగీతం నుంచి తమన్‌ను తప్పించారు సరే మరి ఆ స్థానంలో ఎవరు సంగీతం సమకూరుస్తారనేది ఆసక్తిగా ఉంది. ఇప్పటికే తమిళ సంగీత దర్శకులు అనిరుధ్ రవిచంద్రన్, జీవీ ప్రకాష్ కుమార్‌లో ఒకరికి అవకాశం ఇవ్వవచ్చని ప్రచారం జరిగింది. ఫైనల్ గా అనిరుధ్ రవిచంద్రన్‌కే అందరూ ఓటేసారు. అయితే ఈ వ్యవహారంపై తమన్ కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చేశాడు. మహేశ్ బాబుతో విబేధాల కారణంగానే తమన్‌ను తప్పించారని వస్తున్న ట్రోలింగ్స్‌పై కౌంటర్ ఇచ్చాడు. కడుపు మంట లక్షణాలుండేవాళ్లే ఇలా పుకార్లు రేపుతారని మండిపడ్డారు. ఇంతకీ గుంటూరు కారం సినిమా నుంచి తమన్‌ను తొలగించారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.