యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ Spy ఈరోజు గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చింది. అయితే ఇప్పటికే యూఎస్ఏలో షోస్ పడటంతో మంచి కలెక్షన్స్ రాబట్టింది.
టాలీవుడ్ యంగ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా యాక్షన్ థ్రిల్లర్ మూవీ Spy తోనూ మంచి రెస్పాన్స్ నే దక్కించుకుంటున్నారు. ఈరోజు గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే యూఎస్ఏలో మంచి టాక్ ను దక్కించుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగా కూడా సాలిడ్ ఓపెన్సింగ్ తో స్టార్ట్ చేసింది.
తాజాగా యూఎస్ఏ కలెక్షన్లను హీరో నిఖిల్ స్వయంగా వెల్లడించారు. తొలిరోజు యూఎస్ఏలో బ్లాక్ బాస్టర్ ఓపెనింగ్స్ ను దక్కించుకుందని తెలిపారు. ఏకంగా 135కే పైగా డాలర్స్ ను సాధించినట్టు తెలిపారు. ఇది మంచి కలెక్షననే చెప్పాలి. ఇక ఇవ్వాళ కూడా మంచి రెస్పాన్స్ రానుందని తెలుస్తోంది. అయితే చివరిగా ‘కార్తీకేయ 2’తోనూ యూఎస్ఏలో నిఖిల్ మంచి కలెక్షన్లను రాబట్టారు. ఎప్పుడూ తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఈ సందర్భంగా నిఖిల్ థ్యాంక్యూ చెప్పారు.
ఇదిలా ఉంటే ఈరోజు ఇండియాలోనూ విడుదలవడంతో మంచి టాక్ నైతే సొంతం చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ లోని దేవీ, ఆయా థియేటర్లు హౌజ్ ఫుల్ అయ్యాయి. రిలీజ్ కు ముందే మంచి బజ్ క్రియేట్ చేయడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే వచ్చిన ప్రీమియర్స్ షో, ట్విటర్ టాక్ ప్రకారం.. సినిమా బ్లాక్ బాస్టర్ అంటున్నారు. నిఖిల్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టారని తెలుస్తోంది. ఇంకా రివ్యూస్ వస్తే పూర్తి వివరాలు అందనున్నాయి. ఈ చిత్రానికి గ్యారీ దర్శకుడు. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు.
THANK UUUUUUUUU ...
Overwhelmed 🙏🏽 pic.twitter.com/mOaz0Z9tuN