
ధనవంతుల పిల్లలతో పాటు.. పోటీపడుతూ... పేద విదార్ధులు కూడా పోటీపడి చదవాలన్నారు ప్రముఖ నటి మంచు లక్ష్మీ ప్రసన్నా. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించి.. ప్రైవేట్ విద్యార్థులతో సమానంగా ఇంగ్లీష్ భాషలో రాయడం, చదవం, రావాలి అన్నారు. ఇదే లక్ష్యంతో టీచ్ ఫర్ ఛేంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సినీనటి మంచు లక్ష్మీప్రసన్న తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం మంచు లక్ష్మీ జోగుళాంబ గద్వాల కలెక్టరేట్‌లో కలెక్టర్ వల్లూరు క్రాంతిని కలిశారు. ఆమెతో చాలాసేపు చర్చించిన మంచు లక్ష్మీ.. ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామంటున్నారు. అంతే కాదు ఈ సందర్భంగా మంచులక్ష్మీ మాట్లాడుతూ గద్వాల.. చేనేత చీరలకు ప్రసిద్ధి అని అన్నారు. ఈ జిల్లా నుంచి మంచి విదార్ధులను తయారా చేయాబోతున్నట్టు ప్రకటించారు.
ఇక తమ సంస్థ ఆధ్వర్యంలో గతేడాది యాదాద్రి భువనగిరి జిల్లాలోని 56 పాఠశాలల్లో టీచ్ ఫర్ ఛేంజ్ కార్యక్రమం అమలు చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. దాని స్ఫూర్తిగా తీసుకుని ప్రతీ ఏటా కొన్ని జిల్లాలను ఎంపిక చేసుకుని విద్యార్థులకు డిజిటల్ విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. దాని వల్ల వారి విద్యా ప్రమాణాలు మెరుగవుతాయన్నారు మంచు లక్ష్మీ. అదుకే ఆసారి 30 స్కూల్స్ ను జోగుళాంబ గద్వాల్ జిల్లా నుంచి సెలక్ట్ చేయనున్నట్టు ఆమె ప్రకటించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యాబోధన మూడు స్థాయిల్లో జరుగుతుందని.. ఒకటి నుండి ఐదు తరగతుల విద్యార్థులకు ఇంగ్లీష్ లో బోధన ఉంటుందన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 30 పాఠశాలలను ఎంపిక చేశామని, వాటిలో టీవీ, వాల్‌పేయింటింగ్, కార్పెట్స్, బోధన సామగ్రి సమకూరుస్తామన్నారు. 30 పాఠశాలల్లో వసతులు కల్పించనున్నట్లు అగ్రిమెంట్‌పై సంతకం చేశారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ.. ఇటువంటి మంచి కార్యక్రమం కోసం జోగుళాంబ గద్వాల జిల్లాను ఎంపిక చేయడం అభినందనీయమన్నారు.