దాసరి మృతికి నివాళిగా పుట్టినరోజు వేడుకలకు దూరం

Published : Jun 01, 2017, 08:09 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
దాసరి మృతికి నివాళిగా పుట్టినరోజు వేడుకలకు దూరం

సారాంశం

దాసరి మృతికి నివాళిగా పుట్టినరోజు వేడుకలకు దూరం సినీ కుటుంబం ఓ పెద్ద దిక్కును కోల్పోయిందన్న నిఖిల్ వరుస సక్సెస్ లు వచ్చినా.. వేడుకలు రద్దు చేసుకున్న నిఖిల్

దర్శకరత్న దాసరి నారాయణ రావు మృతి పట్ల తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం బాధాతప్త హృదయంతో కన్నీటిని కార్చింది. చిన్నా..పెద్ద హీరోలు, నటులు ఆయనకు నివాళి అర్పించారు. తాజాగా హీరో నిఖిల్ దాసరికి అక్షర నివాళి సమర్పించారు. తన ఫేస్‌బుక్ పేజీలో దాసరి మరణంపై ఓపెన్ లెటర్ రాశారు. జూన్ 1న నిఖిల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగానే నిఖిల్ ఓపెన్ లెటర్ రాశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన నిఖిల్.. ఇటీవలి కాలంలో వరుసగా విజయాలు సాధిస్తుండడంతో దానిని సెలెబ్రేట్ చేసుకోవాలని భావించానని, కానీ, వాటన్నింటినీ ఇప్పుడు రద్దు చేసుకుంటున్నానని తెలిపారు. నిఖిల్ లేఖ వివరాలు...

 

‘‘సినీ కుటుంబం ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. అందరికీ దార్శనికడు, మార్గదర్శి అయిన దాసరి నారాయణరావుగారిని కోల్పోయాం. ఇంతటి బాధాకరమైన సమయంలో.. వేడుకలు చేసుకుందామనుకున్న నా ప్రణాళికలన్నింటినీ రద్దు చేసుకుంటున్నాను. అదే ఆయనకు నేనిచ్చే గౌరవం. నేను అర్పించే నివాళి. ఆయన 150పైచిలుకు సినిమాలు తీసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన డైరెక్టర్, ప్రొడ్యూసర్, అందరూ ఆదరించిన మాస్ లీడర్ మాత్రమే కాదు. ఆయన చాలా మృదు స్వభావి. దయా హృదయులు. పిల్లల్ని తండ్రి చేయి పట్టుకుని నడిపించినట్టు నేటితరం యువ డైరెక్టర్ల చేయి పట్టుకుని ముందుకు నడిపించిన గొప్ప వ్యక్తి. వందలకొద్దీ చిన్న..మధ్య తరహా సినిమాలను, డైరెక్టర్లను కాపాడిన మంచి వ్యక్తి. చాలా వివాదాలు, సమస్యలను పరిష్కరించిన ధీశాలి. సంక్షోభ సమయాల్లో గుర్తొచ్చే పెద్ద మనిషి. గొప్పవాళ్లకే కాదు.. ఇండస్ట్రీలో రోజూవారీ వేతనం కోసం పనిచేసే వారికీ, చిన్న హీరోలకూ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఆయనది. అలా ఆయన దయా హృదయం పొందిన వాళ్లలో నేను కూడా ఒకడిని. స్వామిరారా, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాల సమయంలో ఆయన స్వయంగా ఫోన్ చేసేవారు. మా సినిమాల 50 రోజుల కార్యక్రమాలకు ఆయనే ఏర్పాట్లు చేయించారు. ఆయన సాధించిన విజయాల ముందు మేం చాలా చిన్నవాళ్లం. అయినా సరే మాపై ఆయన చూపించిన ఆప్యాయత అలాంటిది. అలాంటి ఓ మంచి మనిషి లేరంటేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఆయన మరణం భర్తీ చేయలేని లోటు. కాలం ఎంత ముందుకు పోతున్నా ఆయన లేరనే విషయం మాత్రం బాధకలిగిస్తూనే ఉంటుంది. ఆయన మరణం నాతో పాటు అందరినీ కలచివేసింది. బాధాతప్త హృదయంతో ఓ లెజెండ్ పాదాలను తాకి ఆశీస్సులు పొందిన మీ యువ నటుడు నిఖిల్’’ అంటూ లేఖను ముగించారు.

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?