అతిలోక సుందరి కదా.. అందుకే ఆ మాత్రం తీరిక లేకపోయింది

Published : Jun 01, 2017, 04:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
అతిలోక సుందరి కదా.. అందుకే ఆ మాత్రం తీరిక లేకపోయింది

సారాంశం

దాసరి మృతిపై స్పందించి సినీ పరిశ్రమలు చిరంజీవి,రజినీ, కమల్ సహా స్పందించిన అనేక మందది బాలీవుడ్ ప్రముఖులు శ్రీదేవి కేరీర్ లో దాసరిది ప్రముఖ పాత్ర దాసరి చనిపోతే కనీసం స్పందించని శ్రీదేవి 

'బాహుబలి' సినిమాను తిరస్కరించి తెలుగు దర్శకుడినే కాక తెలుగు వారందరినీ కించపరిచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది శ్రీదేవి. ఈ అతిలోక సుందరికి తన ఎదుగుదలలో తోడ్పాటును అందించిన ఓ మహనీయుడు చనిపోతే కనీసం స్పందించక పోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంంశమైంది. ఆమె పట్ల తెలలుగువారిలో ఇది మరింత వ్యతిరేకత పెంచుతోంది.

 

దర్శకరత్న దాసరి అంటే కేవలం తెలుగు దర్శకుడిగా మాత్రమే పరిగణిస్తే అది పొరబాటే అవుతుంది. మొత్తం భారతీయ సినీ చరిత్రలోనే దాసరి నారాయణరావుది ప్రత్యేకమైన స్థానం.  తెలుగు పరిశ్రమలో అందరిచే గురువుగారు ఆని పిలిపించుకున్న దాసరిని అటు బాలీవుడ్ లోనూ. ఇటు కోలీవుడ్ వాళ్లూ గౌరవిస్తారు. దాసరి మరణవార్త తెలిసిన వెంటనే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మహా నటుడు కమలహాసన్ తదితర బడా హీరోలు కూడా స్పందించారు. తమిళ పరిశ్రమలోనే కాదు.. అటు బాలీవుడ్లోనూ దాసరి విజయ పతాకాన్ని ఎగుర వేశారు. అందుకే బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆయనపై తమ గౌరవాన్ని చాటుకున్నారు. కొందరు బాలీవుడ్ ఫిలిం మేకర్స్, క్రిటిక్స్ కూడా దాసరికి సోషల్ మీడియాలో నివాళి అర్పించారు.

 

అయితే తెలుగు పరిశ్రమ నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. ఆ ఎదుగుదలలో తన వంతు పాత్ర పోషించిన దాసరి లాంటి మహనీయుడు మృతి చెందితే... అతిలోక సుందరిగా పిలవబడుతున్న శ్రీదేవికి మాత్రం కనీసం సోషల్ మీడియాలోనైనా ఒక్క మాట మాట్లాడే తీరిక దొరకలేదు. అసలు శ్రీదేవిని అందలం ఎక్కించింది తెలుగు పరిశ్రమే.. ఆమెకు హీరోయిన్‌గా ఒక గౌరవం ఇచ్చిన తెలుగు సినిమా పెద్దలను కూడా తలుచుకునే పరిస్థితి లేకపోవడం దారుణాతి దారుణం అని చెప్పాలి. ఆమె బాల నటిగా.. ఆపై కథానాయిగా ఎదిగింది తెలుగు పరిశ్రమ నుంచే. ఇక్కడొచ్చిన గుర్తింపుతోనే బాలీవుడ్‌కు వెళ్లి.. అక్కడా ఎదిగింది. శ్రీదేవి ఎదుగుదలకు కారణమైన దర్శకుల్లో దాసరిది కీలక పాత్ర. ఆయన దర్శకత్వంలో బొబ్బిలి పులి, ప్రేమాభిషేకం, కృష్ణార్జునులు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది శ్రీదేవి. దాసరి మరణంపై నేషనల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. 



సోషల్ మీడియాలో కూడా నేషనల్ లెవెల్లో దాసరి పేరు ట్రెండ్ అయింది. నిన్న జాతీయ స్థాయిలో ఇంతకంటే పెద్ద వార్తలేమీ లేవు. మరి దాసరి ఇక లేరన్న సంగతి శ్రీదేవికి తెలియకుండా ఎలా ఉంటుంది. ఆమెకు ఆయన గురించి ఒక కమెంట్ పోస్ట్ చేసే తీరిక లేదా? నిన్నా మొన్నా ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉందా అంటే అదీ లేదు. వచ్చే వారం విడుదల కానున్న తన 300వ సినిమా 'మామ్' గురించి ట్వీట్లు.. రీట్వీట్లు చేస్తూనే ఉంది. అలాంటి సందర్భంలో దాసరి గురించి ఒక చిన్న స్పందన కూడా లేకపోవడం తెలుగు వాళ్లందరిని కలచివేస్తోంది. లైఫ్ ఇచ్చిన దాసరి మరణం గురించి స్పందించకపోవడం దౌర్భాగ్యం.

PREV
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌