నిర్మాతలు నిఖిల్ వెంటపడుతున్నారా..

Published : Nov 30, 2016, 12:24 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
నిర్మాతలు నిఖిల్ వెంటపడుతున్నారా..

సారాంశం

అవును. నిర్మాతలు నిఖిల్ వెంట పడుతున్నారు ఎక్కడికి పోతావు చిన్నవాడాతో పెరిగిన నిఖిల్ క్రేజ్ కథల సెలెక్షన్ లో తనదైన స్టైల్ తో నిఖిల్ కు సక్సెస్ రేట్

కరెన్సీ కష్టాలు సామాన్యులను వెంటాడుతున్న పరిస్థితుల్లో పూర్తిగా ఇబ్బందుల నడుమ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ విడుదల చేసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు హీరో నిఖిల్‌. నిర్మాణానికి పెట్టిన ఖర్చుతో పోలిస్తే ఆ సినిమా సాధించిన కలెక్షన్లు ఎన్నో రెట్లు ఎక్కువ. రెండో వారంలో మరిన్ని థియేటర్లలో విడుదలై నిఖిల్‌ కెరీర్లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది ఈ సినిమా. 

 

ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమా ఇచ్చిన కిక్‌తో నిఖిల్‌ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. కలిసి ఓ సినిమా చేద్దామని చాలామంది నిర్మాతలు నిఖిల్‌ వెంటబడుతున్నారట. నిర్మాత దిల్‌ రాజు ఓ సినిమా చేద్దామని నిఖిల్‌ను అడిగాడట.

దిల్ రాజు సంగతి అలా ఉంటే... హీరో నితిన్‌ అంతకంటే పెద్ద ఆఫర్‌ ఇచ్చాడట. తమ సొంత బ్యానర్‌ ‘శ్రేష్ట్‌ మూవీస్‌’లో వరుసగా రెండు సినిమాలు చేయాలని నితిన్‌ ఆఫర్‌ ఇచ్చాడట. ఇక, చాలామంది నిర్మాతలు ‘కథ నీ ఇష్టం, దర్శకుడెవరనేది నీ ఇష్టం, ఓ సినిమా చేద్దామ’ని అడుగుతున్నారట. రెమ్యునరేషన్‌ కూడా భారీగా ఆఫర్‌ చేస్తున్నారట.

 

అయితే నిఖిల్‌ మాత్రం ఆచితూచి అడుగువేస్తున్నాడట. మంచి కథ ఉంటేనే ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాడట. అప్పట్లో మూడు హిట్‌లు వచ్చిన తర్వాత కోన వెంకట్‌ ఒత్తిడి మీద ‘శంకరాభరణం’ సినిమా చేశాడు. అది కొట్టిన దెబ్బతో ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాడట నిఖిల్‌.

 

PREV
click me!

Recommended Stories

బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్
అన్ని అనుభవించాలన్నదే నా కోరిక.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్