మళ్ళీ మెగాస్టార్ తో కాజల్ రొమాన్స్

Published : Nov 30, 2016, 09:56 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
మళ్ళీ మెగాస్టార్ తో కాజల్ రొమాన్స్

సారాంశం

చిరంజీవితో మళ్లీ స్టెప్పులేసేందుకు రెడీ అయిన కాజల్ ఖైదీ నెంబర్ 150 మూవీ కోసం చివరి సాంగ్ షూట్ ఆర్ ఎఫ్ సీ లో డిసెంబర్ 2 నుంచి షూటింగ్

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెం. 150’. చాలాకాలం తర్వాత చిరు రీ ఎంట్రీ ఇస్తోండడం, ఆయనకిది 150వ సినిమా కావడం లాంటి అంశాలతో ఖైదీ నెం. 150 మొదట్నుంచీ విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోంది.

 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి కాగా, చివరి పాట షూటింగ్ ఒక్కటి మిగిలి ఉంది. యూరోప్ లో ఇటీవలే రెండు పాటల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని మరోపాటను  ఈవారమే పూర్తి చేసేందుకు టీమ్ ఏర్పాట్లు చేసుకుంటోంది.

 

డిసెంబర్ 2నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో చివరి పాట షూటింగ్ జరగనుంది. చిరంజీవి, కాజల్ అగర్వాల్‌లపై ఈ పాట ఉంటుందట. భారీ బడ్జెట్‌తో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా చిరు అభిమానులకు పండగ తెచ్చిపెడుతుందన్న ప్రచారం జరుగుతోంది.

 

జనవరి నెలలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా ‘కత్తి’కి రీమేకే ఈ ‘ఖైదీ నెం. 150’.

 

PREV
click me!

Recommended Stories

'రౌడీ జనార్ధన' గ్లింప్స్ రివ్యూ.. కింగ్డమ్ లా గురి తప్పేలా లేదు, విజయ్ దేవరకొండ బీభత్సం చూశారా
'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?