మ్యాడ్‌ కుర్రాడుని పట్టేసిన నిహారిక.. రెండో సినిమా క్రేజీ కాంబో !

Niharika: మెగా డాటర్‌ నిహారిక కొణిదెల నిర్మాతగా విజయవంతంగా రాణిస్తుంది. ఇప్పటికే `కమిటీ కుర్రోళ్లు` సినిమాతో సక్సెస్‌ అందుకుంది. ఇప్పుడు రెండో ప్రాజెక్ట్ ని ప్రకటించింది. 
 


Niharika: మెగా డాటర్ నిహారిక వెబ్‌ సిరీస్‌, ఓటీటీ మూవీస్‌ నుంచి ఇప్పుడు ఫీచర్‌ ఫిల్మ్స్ ని కూడా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గతేడాది `కమిటీ కుర్రోళ్లు` సినిమాతో హిట్‌ అందుకుంది. చిన్న సినిమాగా వచ్చి ఇది పెద్ద విజయం సాధించింది. ఈ మూవీతో నిహారిక నిర్మాతగా సక్సెస్‌ అయ్యింది. ఇప్పుడు మరో క్రేజీ మూవీతో రాబోతుంది. తాజాగా కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించింది నిహారిక. 

`మ్యాడ్‌ స్వ్కేర్‌`తో రచ్చ చేసిన సంగీత్‌ శోభన్‌

`మ్యాడ్‌` సినిమాలతో ఆకట్టుకున్నాడు సంగీత్‌ శోభన్‌. ఇటీవల వచ్చిన `మ్యాడ్‌ స్వ్కేర్‌` సూపర్‌ హిట్‌గా నిలిచింది. వంద కోట్ల దిశగా వెళ్తుంది. ఇందులో నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌తోపాటు సంగీత్‌ శోభన్‌ హీరోగా నటించారు. ఇందులో సంగీత్‌ కే ఎక్కువ పేరు వచ్చింది. డైలాగ్‌ డెలివరీ, కామెడీ పంచ్‌లు, యాక్టింగ్‌ విషయంలో మిగిలిన ఇద్దరి కంటే సంగీత్‌ కే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు సోలో హీరోగా ఆఫర్లు వస్తున్నాయి. 

సంగీత్‌ శోభన్‌ హీరోగా నిహారిక కొణిదెల రెండో సినిమా

Latest Videos

అందులో భాగంగా సంగీత్‌ శోభన్‌ హీరోగా నిహారిక సినిమా చేయబోతుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది. తన పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్ పతాకంపై నిహారిక ఈ మూవీని నిర్మిస్తుంది. `కమిటీ కుర్రోళ్లు` తర్వాత నిహారిక చేయబోతున్న రెండో సినిమా ఇది కావడం విశేషం. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు. 

నిహారిక ప్రొడక్షన్‌లో వర్క్ చేసిన సంగీత్‌ శోభన్‌, మానస శర్మ

అంతకు ముందు నిహారిక రూపొందించిన వెబ్‌ ప్రాజెక్ట్స్ లో హీరో సంగీత్‌ శోభన్‌, మానస శర్మ భాగమయ్యారు. జీ5తో కలిసి పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్ పై నిహారిక నిర్మించిన `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ` వెబ్‌ సిరీస్‌కి మానస శర్మ రైటర్‌గా పనిచేశారు. ఇందులో సంగీత్‌ శోభన్‌ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే సోనీ లివ్‌ రూపొందించిన `బెంచ్‌ లైఫ్‌`కి మానస శర్మ దర్శకురాలిగా పని చేశారు.  

ఇప్పుడు ఫీచర్‌ ఫిల్మ్ తో దర్శకురాలిగా మారుతున్నారు. ఈ చిత్రానికి మానస శర్మ కథను అందించగా మహేష్ ఉప్పల కో రైటర్‌గా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

read  more: `ఆదిత్య 369`లో హీరోయిన్‌గా విజయశాంతి ఎలా మిస్‌ అయ్యిందో తెలుసా? బాలయ్యతో అలా చేయడం వల్లే!

also read: రామ్ చరణ్ మిస్ అయిన టాప్ 5 సినిమాలు ఏవో తెలుసా? అందులో బ్లాక్ బస్టర్ మూవీస్ ఎన్ని?
 

click me!