NGK రిలీజ్ డేట్.. ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చిన సూర్య!

Published : Nov 15, 2018, 08:25 PM IST
NGK రిలీజ్ డేట్.. ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చిన సూర్య!

సారాంశం

7/G బృందావన కాలనీ - ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే వంటి సినిమాలతో టాలీవుడ్ లో మంచి హిట్స్ అందుకున్న దర్శకుడు సెల్వా రాఘవన్. ఈ కోలీవుడ్ డైరెక్టర్ ప్రస్తుతం సూర్యతో NGK అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

7/G బృందావన కాలనీ - ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే వంటి సినిమాలతో టాలీవుడ్ లో మంచి హిట్స్ అందుకున్న దర్శకుడు సెల్వా రాఘవన్. ఈ కోలీవుడ్ డైరెక్టర్ ప్రస్తుతం సూర్యతో NGK అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ డ్రామా గా రానున్న ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు. 

తెలుగు అండ్ తమిళ్ లో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తోన్న ఇరు బాషా అభిమానులకు గత కొన్ని రోజులుగా రూమర్స్ క్లారిటీ లేకుండా చేస్తున్నాయి. అయితే ఫైనల్ గా చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేసింది. సినిమావచ్చే ఏడాది జనవరి 26న విడుదల కానుందని ఇందులో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. 

సాయి పల్లవి - రకూల్ ప్రీత్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌