మహేష్ AMB మల్టిప్లెక్స్: మొదటి సినిమా 2.ఓ!

By Prashanth MFirst Published Nov 15, 2018, 6:30 PM IST
Highlights

సినిమా ప్రపంచంలో నాలుగు రాళ్లు వెనకేసుకుంటేనే ఫ్యూచర్ బావుంటుందనే సూత్రాన్ని మహేష్ బాబుకు బాగా తెలిసినట్టుంది. అందుకే వ్యాపారాలతో తెగ బిజీ అవుతున్నాడు. ముఖ్యంగా సినిమాలకు సంబందించిన వ్యాపారాలనే చేస్తున్నాడు. ఏషియన్ వారితో కలిసి AMB అని మహేష్ మల్టిప్లెక్స్ లను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. 

తెలుగు రాష్ట్రాల్లో ఈ బిజినెస్ లను విస్తృతం చేయడానికి మహేష్ ఇతర వ్యాపారులతో కూడా కలిసి పనిచేస్తున్నాడు. మొదటగా గచ్చిబౌలిలో 7 స్క్రీన్స్ గల అతిపెద్ద మల్టిప్లెక్స్ ను మహేష్ స్టార్ట్ చేయనున్నాడు. ఈ మాల్ ని కొన్ని రోజుల క్రితమే స్టార్ట్ చేయాలనీ అనుకున్నారు. థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ మొదటి షో గా AMBలో ప్రదర్శించబడనుందని వార్తలు వచ్చాయి. 

అయితే మల్టిప్లెక్స్ లో కొన్ని పనులు బ్యాలెన్స్ ఉండటంతో మహేష్ లాంచ్ డేట్ ను వాయిదా వేశాడు. ఇక మరికొన్ని రోజుల్లో ఎలాగైనా స్టార్ట్ చేయాలనీ తన టీమ్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా మల్టిప్లెక్స్ ను కూడా సందర్శించాడు మహేష్. ఇక మొదటగా రజినీకాంత్ ప్రతిష్టాత్మక చిత్రం 2.0ను ప్రదర్శించనున్నారు. 

ఈ మల్టిప్లెక్స్ ను ఎంతో స్టైలిష్ గా లగ్జరిగా నిర్మించారు. థియేటర్ కు సంబందించిన కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి. పడుకొని చూసేందుకు కూడా కొన్ని స్పెషల్ సీట్లను స్క్రీన్స్ ను సెట్ చేశారు.  మొత్తం ఈ మల్టి ప్లెక్స్  7 స్క్రీన్స్ లలో దాదాపు 1600కు పైగా సీట్లు ఉన్నట్లు తెలుస్తోంది. 

click me!