రాజమౌళి ఇంట పెళ్లి సందడి.. ముహూర్తం ఎప్పుడంటే?

By Prashanth MFirst Published 15, Nov 2018, 7:57 PM IST
Highlights

దర్శకదీరుడు రాజమౌళి ఇంట మరికొన్ని రోజుల్లో ఒక వేడుక జరగబోతోంది. ఇటీవల RRR లాంచ్ వేడుకతో బిజీ అయిన జక్కన్న ఫ్యామిలీ త్వరలోనే పెళ్లి హడావుడిలో బిజి కానుంది. 

దర్శకదీరుడు రాజమౌళి ఇంట మరికొన్ని రోజుల్లో ఒక వేడుక జరగబోతోంది. ఇటీవల RRR లాంచ్ వేడుకతో బిజీ అయిన జక్కన్న ఫ్యామిలీ త్వరలోనే పెళ్లి హడావుడిలో బిజి కానుంది. రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లిపీటలెక్కబోతున్న సంగతి అందరికి తెలిసిందే. 

అయితే పెళ్లి ఎప్పుడు జరగనుంది అనే విషయంలో అనేక రూమర్స్ వచ్చాయి. ఫైనల్ గా ఇరు కుటుంబసభ్యులు ముహుర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు. జనవరి 5న కార్తికేయ తను ఇష్టపడిన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో వారి వివాహ వేదికను ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 

కేవలం పెళ్లికి రెండు కుటుంబాల సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారట. సాయంత్రం 6గంటల 30నిమిషాలకు నిశ్చయించారు. డిసెంబర్ ఎండింగ్ లో రాజమౌళి టీమ్ RRR మొదటి షెడ్యూల్ ని విలైనంత త్వరగా పూర్తి చేయాలనీ అనుకుంటోంది. ఫస్ట్ షెడ్యూల్ నెక్స్ట్ వీక్ లో మొదలవ్వనుంది.  

Last Updated 15, Nov 2018, 7:57 PM IST