
తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఎవరూ అంటే...యంగ్ బ్యూటీ శ్రీలీల. వరస పెట్టి క్రేజీ సినిమాల్లో ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. ఎవరూ ఊహించని స్పీడుతో ముందుకు వెళ్తూ... అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగు పరిశ్రమలోకి పెళ్లి సందD చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. మొగటి సినిమాతో గుర్తింపు సంపాదించుకున్న ఆమెకు ఇప్పుడు వరస ఆఫర్స్ వస్తున్నాయి. గత ఏడాది మాస్ మహారాజా రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించటం ఆమెకు ఓ రేంజిలో ప్లస్ అయ్యింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అది ఏ స్దాయికి వెళ్లిందంటే... సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న SSMB 28లో హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమె ఎఫెక్ట్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న హీరోయిన్స్ పై బాగా పడింది. ఇక ఇప్పుడు మరో విషయం బయిటకు వచ్చింది. యూత్ లో ఓ రేంజిలో ఫాలోయింగ్ ఉన్న ...విజయ్ దేవరకొండ తో ...శ్రీలీలాని అనుకుంటున్నారని సమాచారం. సితార బ్యానర్‌లో సినిమాలో ఈ చిత్రం రూపొందనుంది. గౌతమ్ తిన్ననూరి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
స్పై థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకాబోతున్నట్లు తెలిసింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 12వ సినిమా ఇది. ఇందులో అతడి క్యారెక్టర్ కొత్త కోణంలో సాగుతుందని సమాచారం. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో ప్యూర్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతోపాటు పరశురామ్‌తోనూ ఇటీవలే ఓ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. దిల్‌రాజు దీన్ని నిర్మించనున్నారు.
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న చిత్రంలో పూజా హెగ్డేతో పాటు శ్రీలీల కనిపించబోతోంది. అనిల్ రావిపూడి బాలయ్య సినిమాలో కూతురి పాత్రలో నటిస్తోంది. బోయపాటి రామ్, నితిన్ 32వ సినిమా, నవీన్ పొలిశెట్టి కొత్త చిత్రం, వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ తీసుకునే అవకాశాలున్నాయి. ఇంకా కొన్ని ప్రాజెక్టులు కూడా మాటలు జరుగుతన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కమిటైన సినిమాల్లో కనీసం మూడు నాలుగు బ్లాక్ బస్టర్ హిట్లు అయినా కూడా శ్రీలీల కెరీర్ ఇంకో లెవెల్‌కు వెళ్తుందని విశ్లేషకుల అంచనా.
ఇక శ్రీలీల విషయానికి వస్తే... రష్మిక, పూజా, కృతి శెట్టి, కీర్తి సురేష్ ఇలా అందరూ ఒక్కసారిగై సైడ్ అయ్యిపోతున్నారు. వాళ్లు కెరీర్ ప్రారంభంలో ఒక్క సక్సెస్ రాగానే వరస ఆఫర్లు దక్కించుకున్నవారే. సమంత సైతం శ్రీలీల దెబ్బకు సైడ్ అయ్యిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీల అంత బిజీగా ఎవ్వరూ లేరనేది నిజం. ఆ మధ్యన వైష్ణవ్ తేజ్ తో చేసిన ఉప్పెనతో కృతి శెట్టికి క్రేజ్ వచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవ్వడంతో ఆమెను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
రష్మికకు తెలుగులో ఇప్పుడు ఒక్క ప్రాజెక్ట్ (పుష్ప ది రూల్) మాత్రమే ఉంది. పూజా హెగ్డేకు మహేష్ బాబు సినిమా ఉంది. సమంతకు ఖుషి సినిమా ఉంది. ఇలా స్టార్ హీరోయిన్లు అంతా కేవలం ఒకటి రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. కానీ శ్రీలీల చేతిలో మాత్రం దాదాపు పది సినిమాలు విశేషం.