
బాలనటిగా పాపులర్ అయిన అనిఖా సురేంద్రన్ హీరోయిన్‌గా మారి నటించిన సినిమా `బుట్టబొమ్మ`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, త్రివిక్రమ్ ఫార్చ్యూన్ సినిమాస్ పతాకాలపై తెరకెక్కింది. విడుదలకు ముందు మంచి బజ్ నెలకొన్న ఈ చిత్రం విడుదలయ్యాక డిజప్పాయింట్ చేసింది. ఫిబ్రవరి 4న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. చిన్న కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ సినిమా లాగ్ ఎక్కువ ఉందని, ఎంటర్‌టైనింగ్ గా లేదనే విమర్శలొచ్చాయి.
మొత్తానికి ఈ సినిమా ఆడదని నిర్మాతలకు ముందే తెలుసట. ఆ విషయాన్ని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. ఈ సినిమా ఆడదని త్రివిక్రమ్ ముందే చెప్పారని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రాబోతుంది. నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందట. మరో మూడు రోజుల్లోనే, అంటే మార్చి 4న ఈ చిత్రం ఓటీటీలో రానుందని తెలుస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. తెలుగుతోపాటు తమిళః, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా మార్చి 4న స్ట్రీమింగ్ కానుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ఇక మలయాళంలో విజయం సాధించి `కప్పెల` సినిమాకి `బుట్టబొమ్మ` రీమేక్. ఇందులో అనిఖా సురేంద్రన్‌తోపాటు సూర్యవశిష్ట, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించారు. శౌరీ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. నాగవంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్ .. అజిత్ నటించిన `విశ్వాసం` చిత్రంలో బాల నటిగా నటించి పాపులర్ అయిన విషయం తెలిసిందే. `బుట్టబొమ్మ` ఆమెకి హీరోయిన్‌గా తొలి సినిమా కావడం విశేషం.