Ennenno Janmala Bandham: యష్ కి సలహాలు ఇచ్చిన శశిధర్.. చిత్ర ప్లాన్ ని పసిగట్టిన అభి?

Published : Mar 01, 2023, 10:19 AM IST
Ennenno Janmala Bandham: యష్ కి సలహాలు ఇచ్చిన శశిధర్.. చిత్ర ప్లాన్ ని పసిగట్టిన అభి?

సారాంశం

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు మార్చి 1వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్లో వేద ఇంటికి వెళ్లి మీరు ఫ్రెష్ అయి స్నానం చేసి రండి అనగా నేను వెళ్తే మరి నిన్ను ఎవరు చూసుకుంటారు అనడంతో ఉన్నాను కదా యష్ అంటూ విన్నీ అక్కడికి వస్తాడు. వేద విన్ని చూడండి ఎంత బాగా రెడీ అయ్యి వచ్చాడు అనడంతో వాడు వాని కాకరకాయ ముఖం బాగా రెడీ అయ్యాడా అనుకుంటూ ఉంటాడు. నేను ఒంటరిగా ఏం లేను కాసేపట్లో అమ్మ వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వస్తారు నా మాట విని ఇంటికి వెళ్లి రండి అని అంటుంది వేద. ఎలా పడితే అలా ఉండడానికి మీరు మామూలు సాదాసీదా మంచి కాదు బెస్ట్ సీఈఓ అని అంటుంది వేద. ఎవరైనా చూస్తే ఏమైనా అనుకోరు నేను భర్తని పట్టించుకోరు అనుకుంటారు కదా ఎంతైనా నేను సీఈవో భార్యని కదా అని అంటుంది వేద.

 అప్పుడు విన్నీ అవును యష్ నేను ఉన్నాను కదా వేదనీ కంటికి రెప్పలా చూసుకోవడానికి అనగా కోప్పడుతూ ఉంటాడు.  నువ్వే కదరా నా ప్రాబ్లం బెస్ట్ హస్బెండ్ అవ్వనివ్వవు నువ్వు మాత్రం బెస్ట్ ఫ్రెండ్ అనిపించుకుంటావు సమయం సందర్భం నీ సంగతి చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు యష్. తర్వాత ఇంటికి వెళ్లిన రెడీ అయ్యి అద్దం ముందు నిలబడి పదేపదే విన్నీ అన్న మాటలు తలుచుకొని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈ పిడత మొహం గాడికి ఒక్క అమ్మాయి కూడా దొరకలేదు ముదిరి పోయిన బెండకాయలా ఉన్నాడు అనుకుంటూ విన్నీ తిట్టుకుంటూ ఉంటాడు. తర్వాత విన్నీ, వేద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఎందుకు అలా సడన్గా పడిపోయావు అనగా ఎందుకు అలా కళ్ళు తిరిగాయి అనగా అనడంతో సరే అబద్దం బాగా చెప్పావు ఇప్పుడు నిజం చెప్పు అని అంటాడు విన్నీ.

అప్పుడు వేద యష్ నీ ఆరోగ్యానికి కారణం మా ఆయన కాదు అని అంటుంది. మరొకవైపు యష్ ఒక భర్తగా వేదాకి నేను ఏం చేశాను? నీకేం తెలుసురా అనుకుంటూ అద్దం ముందు నిలబడి విని తిట్టుకుంటూ ఉంటాడు.  నేను వేద కోసం ఎన్ని చేశాను కార్ టైరు మారిపించాను తన ఆధార్ కార్డు డేట్ మార్పించాను అంటే చిల్లి రీజన్స్ చెప్తూ ఉంటాడు. మరొకవైపు వేద నువ్వు చెప్పినట్టుగా మా ఆయన వల్లే నేను ఈ పరిస్థితి కి వచ్చి ఉంటే హాస్పిటల్ బెడ్ పైనే ఉండే దాన్ని అంటుంది. చాలా బాగా మాట్లాడుతున్నావు వెదు అనడంతో నేను చెప్పేది విను విన్నీ నేను టుడేస్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాను కదా అందుకే ఇలా జరిగింది అని అంటుంది వేద.

మరొకవైపు యష్ వరల్డ్ బెస్ట్ హస్బెండ్ ఎవరు అంటే ఆ అవార్డు నాకే ఇవ్వాలి. అయినా బెస్ట్ హస్బెండ్ అని నాకు నేను చెప్పుకోవాలా నాకు నేను ఏంటో తెలుసు కదా అని అనుకుంటూ ఉంటాడు యష్. మరోవైపు విన్నీ తల్లి నీకు ఒక నమస్కారం నీ భర్త వల్ల నువ్వు ఏమైనా ఇబ్బంది పడుతున్నావేమో అని తెలుసుకుందామని అడిగాను అంటాడు. అప్పుడు విన్నీ నేను ఒక మాట ఇస్తున్నాను ఏదో ఈ విషయం బాగా గుర్తు పెట్టుకో నిన్ను ఎవరు ఏమన్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నీకు నేనున్నాను అన్న విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకో అని మాట ఇస్తాడు విన్నీ. మరోవైపు యష్ ఎలా అయినా నిన్ను గ్రేట్ హస్బెండ్ ని అని వానికి తెలిసేలా చేరుస్తాను వాడి పొగరు అనుష్ఠానం అనుకుంటూ ఉంటాడు.

 మరొకవైపు చిత్ర ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉండగా ఇంతలో పల్లవి అని అమ్మాయి అక్కడికి వచ్చి నీకు ఒక సీక్రెట్ చెప్పాలి అని అంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి నేను అభిమాని సార్ 10 డేస్ లో ఫారిన్ టూర్ వెళ్తున్నాము అని అనగా ఇదేదో మనకు పనికొచ్చేలా ఉంది అని చిత్ర ఆ అమ్మాయి చెప్పేవన్నీ వింటూ ఓహో ఆహా అంటూ వీడియోని తీస్తూ ఉంటుంది. అయితే నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి చిత్ర ఇవన్నీ కూడా అభిమన్యు సార్ ఈ విషయాలు ఎక్కడికి తెలియకూడదు ఎవరికి తెలియకూడదు అని చెప్పాడు అనగా నేను ఎవరికి చెప్పనులే పల్లవి అని అంటుంది చిత్ర. 

ఆ వీడియో రికార్డ్ చేశాను ఇది మాళవికకు చూపించాలి అంటుండగా ఇంతలో అదంతా చూసిన అభిమన్యు నాకు గూడచారిగా కూడా పనిచేస్తున్నావా చిత్ర నన్ను మాళవిక దగ్గర బ్యాడ్ చేయాలని చూస్తున్నావా సరే కానీ ఓ నా ప్లాన్ లేవు నేను చేస్తాను అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు ఒక చోటికి వెళ్లిన శశిధర్ ని కలిసి మంచి హస్బెండ్ ఎలా అవ్వాలి? ఎలా ఉండాలి అని అడగగా ఇప్పుడు నువ్వు మంచి హస్బెండ్ వే కదా ఎందుకని అన్ని అడుగుతున్నావు అనడంతో వేద సార్లు మీ గురించి చాలా గొప్పగా చెప్పింది అందుకే మీరు అయితే బాగుంటుందని నీ దగ్గరికి వచ్చాను అని అంటాడు. అప్పుడు శశిధర్, యష్ కు భార్య గురించి భార్య ఒక గొప్పతనం గురించి వివరిస్తూ ఉంటాడు. అప్పుడు యష్, శశిధర్ మాటలకు ఆలోచనలో పడతాడు.


అప్పుడు యష్ ఈ లాంగ్వేజ్ లో కాకుండా మనకు డైరెక్ట్ అయ్యేలా ఏదైనా సింపుల్ చిట్కాలు చెప్పండి బ్రో అని అంటాడు. ఏం లేదు బ్రో ప్రతి ఒక్క విషయంలో నువ్వు వేదకు అండగా ఉండమని చెబుతున్నాను అని అంటాడు శశిధర్. అప్పుడు యష్ వేదతో ఏడగులు వేసిన విషయాన్ని గుర్తుతెచ్చుకొని సంతోష పడుతూ ఉంటాడు. అప్పుడు శశిధర్ ఏ భార్యకైనా కూడా నా భర్త ఉన్నాడు అనే ధైర్యాన్ని కలిగించాలి అని అంటాడు. అప్పుడు శశిధర్ మాటలకు యష్ సంతోష పడుతూ శశిధర్ నీ హత్తుకుంటాడు. ఆ తరువాత హాస్పిటల్ కి వస్తాడు. అప్పుడు వేదా పడుకుని ఉండగా 12:30 అయింది లంచ్ టైం అయింది కదా వేద నీ ఎవరు పట్టించుకోరు అందుకే నేను వెళ్ళను అనేది అని వేదవైపు అలాగే చూస్తూ ఉంటాడు.

 నిద్ర పోతుంటే అందాల రాక్షసి ఎంత అందంగా ఉందో అనడంతో థాంక్స్ అని అంటుంది వేద. అప్పుడు సరే నిద్ర లేచావు కదా ఫుడ్ తిందువు అనడంతో నాకొద్దు అండి టాబ్లెట్స్ మింగి నోరంతా చేదుగా ఉంది నేను తినలేను అనడంతో నీకోసం అదే పనిగా ఇంటి దగ్గర నుంచి తీసుకు వచ్చాను తినకపోతే చూడు అని అంటాడు యశోదర్. అప్పుడు వేదకి తినిపిస్తుండగా హలో విన్నీ కూడా ఉన్నాడు అని అక్కడికి రావడంతో లోలోపల కుళ్ళుకుంటూ ఉంటాడు యశోదర్. నీకు ఇష్టమైన ఫుడ్ తెచ్చిన తినవా నీ కోసం న్యూడిల్స్ తెచ్చాను అనడంతో థాంక్యూ సో మచ్ విన్నీ అని అంటుంది వేద. నన్ను నీలా ఇంత బాగా ఎవరు అర్థం చేసుకోలేరు అనడంతో కుళ్లుకుంటూ ఉంటాడు. మీ ఆయన నీకోసం ఇంటి నుంచి ఫుడ్డు తీసుకుని వచ్చాడు అనగా అది మా ఆయన తినేస్తాడు ఏవండీ మీరు తినేయండి అంటూ ఆ న్యూడిల్స్ తింటూ విన్నీ చాలా సూపర్ చాలా టేస్టీగా ఉంది అని అంటుంది వేద.అప్పుడు వేద న్యూడిల్స్ తింటూ విన్నీనీ పొగుడుతూ ఉండగా కుళ్ళుకుంటూ ఉంటాడు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు