మంచులక్ష్మీపై నెటిజన్ల ఫైర్!

Published : Oct 17, 2018, 10:11 AM IST
మంచులక్ష్మీపై నెటిజన్ల ఫైర్!

సారాంశం

సెలబ్రిటీలు కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం సాధారణం. ప్రకటనల్లో నటించి, బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి బాగానే డబ్బు సంపాదిస్తుంటారు. ఇప్పటికే  మహేశ్ బాబు, అల్లు అర్జున్, అఖిల్, వరుణ్ తేజ్ ఇలా చాలా మంది తారలు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. 

తాజాగా మంచు లక్ష్మీ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. గతంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నకుర్ కురేకి మంచి లక్ష్మీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడాన్ని నెటిజన్లు  తప్పుబడుతున్నారు.

కుర్ కురేని సపోర్ట్ చేస్తూ ఆమె నటించిన యాడ్ లో కోల్ కత్తాలోని కుర్ కురే తయారీ కేంద్రానికి వెళ్లానని అక్కడ చాలా సురక్షితంగా కుర్ కురే తయారు చేస్తున్నారని చెప్పారు. దీంతో నెటిజన్లు.. మీ కూతురికి లేదా మంచు విష్ణు పిల్లలకి కుర్ కురే పెట్టగలరా..? వారు తినే వీడియోని పోస్ట్ చేయగలరా..? అంటూ సవాల్ చేస్తున్నారు.

మీరు ఆచరించిన తరువాత సలహాలు ఇవ్వాలంటూ మండిపడుతున్నారు. మీ పిల్లలు ఆరోగ్యవంతమైన తిండి తింటారు మా పిల్లలని మాత్రం ఇలాంటివి తినమని  సలహా ఇస్తారా..? అంటూ ఫైర్ అవుతున్నారు. మరి మంచులక్ష్మీ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?