యంగ్ హీరో బోల్డ్ లవ్ స్టోరీ!

Published : Oct 17, 2018, 09:54 AM IST
యంగ్ హీరో బోల్డ్ లవ్ స్టోరీ!

సారాంశం

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం 'ముద్ర' అనే సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. దీంతో తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు నిఖిల్. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక జరగనుంది.

కొత్త దర్శకుడు కిషన్ ఈ సినిమాతో వెండితెరకు పరిచయం కానున్నారు. అయితే ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందనే విషయంపై స్పష్టత వచ్చింది. ఇప్పటివరకు నిఖిల్ పూర్తిస్థాయి ప్రేమ కథా చిత్రాల్లో నటించింది లేదు.

అందుకే ఈసారి ప్యూర్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. బోల్డ్ లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి 'శ్వాస' అనే టైటిల్ ని ఖరారు చేశారు. నిఖిల్ కి జంటగా నివేదా థామస్ కనిపించనుంది.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువులు, అలానే ట్రూజెట్ ఎయిర్ లైన్స్ నిర్వాహకులు కలిసి కొత్త బ్యానర్ ని స్థాపిస్తున్నారు. ఈ బ్యానర్ లోనే నిఖిల్ 'శ్వాస' సినిమా చేయనున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత చందు మొండేటితో సినిమా చేయనున్నాడు నిఖిల్. 

PREV
click me!

Recommended Stories

హీరోయిన్ ని నిజంగానే కాలితో తన్నారా ? వెక్కి వెక్కి ఏడుస్తూ బయటకి.. ఎన్టీఆర్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్
1000 కోట్ల సినిమా ను ఒక ఫ్లాప్ మూవీ కోసం వదిలేసుకున్న నాగార్జున, కారణం ఏంటో తెలుసా?