
రానా హీరోగా దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీ ఈ శుక్రవారం భారీ అంచనాలతో విడుదలై... అనుకున్నట్లుగానే భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. బాహుబలి మూవీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రానా అందుకు తగ్గట్లే ‘నేనే రాజు నేనే మంత్రి’తో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ మూవీ టైటిల్‌తో పాటు.. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌లకు ప్రేక్షకులనుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో రానా భారీ హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడని ఫ్యాన్స్ ముందే ఫిక్స్ అయ్యారు. అభిమానుల అంచనాలకు తగ్గట్లే... ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీలోని జోగేంద్రా.. జోగేంద్రా జైబోలో జోగేంద్ర అని పాట పాడినట్లే... ప్రేక్షకులతో జైబోలో అనిపించుకున్నాడు రనా. ‘నేనే రాజు నేనే మంత్రి’మూవీకి హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్‌లో దూకుడు చూపిస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీ ఓపెనింగ్స్ సాధించగా.. నైజాం ఏరియాలో ఈ చిత్రం తొలిరోజు రూ 1.2 కోట్ల షేర్‌ని సాధించినట్టు మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు. లాంగ్ వీకెండ్ కావడంతో శని, ఆది వారాల్లో మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా బి, సి సెంటర్లలో జోగేంద్రుడి జోరు ఎక్కువగా ఉండేట్టు కనిపిస్తోంది.
మూవీలో రానా క్యారెక్టర్‌ను దర్శకుడు మలిచిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘వందమంది ఎమ్మెల్యేలను స్టార్ హోటల్‌లో కూర్చోబెడితే సాయంకాలానికి నేను అవుతా సీఎం’ అంటూ రానా పొలిటికల్ సెటైర్స్‌తో పాటు.. ‘లెక్కేసి కొడితే ఐదేళ్లలో సీఎం సీటు నా సీటు కింద ఉండాలి. పాముకు పుట్ట కావాలంటే చీమలే కదా కష్టపడాలి’ అంటూ రానా చెప్పిన మాస్ డైలాగ్స్ థియేటర్స్‌లోని మాస్ ఆడియన్స్‌తో చప్పట్లు కొట్టిస్తున్నాయి. రాధా జోగేంద్రగా నటించిన కాజల్ కూడా తన పాత్రకు వందశాతానికి మించి న్యాయం చేసింది. ఇక ఈ మూవీకి ఆడియన్స్‌నుండి పాజిటివ్ టాక్ రావడంతో చిత్రంయూనిట్ ఫుల్ పార్టీ మూడ్ లో వుంది.