రానా చెవిపై బంగారం వెనుక చాలా కథే వుంది

Published : Jul 04, 2017, 07:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
రానా చెవిపై బంగారం వెనుక చాలా కథే వుంది

సారాంశం

రానా, తేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి ఈ సినిమాలో సీఎం సీటునెక్కే యువకుని పాత్రలో నటిస్తున్న రానా ప్రమోషన్ పిక్ లో రానా చెవికున్న బంగారు తొడుగు గురించి హాట్ టాపిక్

 ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీ. ప్రస్తుతం ఫెయిల్యూర్ దర్శకుడుగా పేరు గాంచిన తేజ దర్శకత్వంలో వస్తున్న ఈమూవీ పోస్టర్లకు టీజర్ కు వస్తున్న స్పందన చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 

 

ఇప్పటికే కేవలం 20 కోట్ల బడ్జెట్ తో రూపొందింపబడిన ఈమూవీ బిజినెస్ దాదాపు 40 కోట్ల వరకు జరిగింది అని వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఈమధ్య రిలీజ్ అయిన ఒక స్టిల్ లో రానా చెవి పైన బంగారు తొడుగు కనిపించడం చాలామందిని ఆశ్చర్య పరిచింది.

 

అయితే ఆసక్తికరమైన ఈ ఫోటో వెనుక ఒక విషయం ఉంది అని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక సీన్ లో ఒక తుపాకీ తూటా రానా చెవి మీదుగా దూసుకు వెళుతుందట. దీనితో రానా చెవిలోని కొంత భాగం దెబ్బ తింటే రానా ఆ దెబ్బతిన్న భాగాన్ని బంగారపు తొడుగుతూ కథ రీత్యా కవర్ చేయిస్తాడట. 

 

ప్రతిరోజు రానా కు తన చెవి పై ఉన్న బంగారు తొడుగును చూడగానే తన శత్రువులను గుర్తుకు చేసుకోవడానికి రానా ఇలాంటి బంగారు తొడుగును ఈ సినిమాలో తన పాత్ర స్వభావం రీత్యా పెట్టుకున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత రాజకీయాల పై సెటైర్లు వేసే కథ తో తీసిన ఈ సినిమా పై దర్శకుడు తేజా మాత్రమే కాకుండా రానా కూడ చాల ఆశలు పెట్టుకున్నాడు.

PREV
click me!

Recommended Stories

మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు
అఖండ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్, బాలయ్యకు భారీ షాక్, గతవారం రిలీజైన 6 సినిమాల రిపోర్ట్ సంగతేంటి?