స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంపై సినిమాను ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ

Published : Jul 04, 2017, 01:01 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంపై సినిమాను ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ

సారాంశం

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న భారీ చిత్రం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ ఆధారంగా రానున్న చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం

తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ప్రపంచచానికి చాటిన మహనీయుడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు జీవితంపై తెరకెక్కనున్న సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న ఈ మూవీకి సంబంధించిన ఒక పాటను కూడా రికార్డ్ చేయించాడు వర్మ.

 

తెలుగువాడిని మొట్టమొదటిసారిగా తలత్తెకునేలా చేసింది NTR అనబడే మూడు అక్షరాలు. ఆ పేరు వింటే చాలు తెలుగువాడి ఛాతి గర్వంతో  పొంగిపోతుంది, స్వాభిమానం తన్నుకొస్తుంది. ఆయన ఒక మహానటుడే కాదు,మొత్తం తెలుగు నేల ఆయనకు ముందు, ఆయన తర్వాత కూడా చూడని అత్యధిక ప్రజాదరణ కలిగిన మహా రాజకీయ నాయకుడు. నాకు ఆయనతో పర్సనల్ గా వున్న అనుబంధం ఏమిటంటే ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అడవి రాముడు సినిమా చూడటానికి 23 సార్లు బస్ టికెట్ కి డబ్బుల్లేక 10 కిమీ దూరం కాలి నడకన వెళ్లేవాడిని. అంతే కాకుండా NTR తెలుగు దేశం పార్టీ అనౌన్స్ చేసిన మొదటి మహానాడు మీటింగులో నేల ఈనినట్టు వచ్చిన  లక్షలాది మందిలో నేనూ వున్నాను. అలాంటి అతి మామూలు నేను...  ఇప్పుడు NTR జీవితాన్నే ఒక బయోపిక్ గా తెరకు ఎక్కించడం చాలా చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.

 

ఈ అత్యంత నిజమైన ఆ మహామనిషి NTR బయోపిక్ లో ఆయన శత్రువులెవరో ,నమ్మక ద్రోహులెవరో,ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనకాల అసలు కాంట్రవర్సీలేమిటో  అవన్నీ అశేష తెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా NTR చిత్రం లో చూపిస్తాను. "ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని" అని రాయప్రోలు గారంటే, నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్ కెపాసిటీలో కాకుండా  8 కోట్ల తెలుగు వాళ్లలో కేవలం ఒకడిగా ప్రపంచంలో వున్న ప్రతి తెలుగువాడికి చెప్పేది.. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని, పొగడరా నీ తండ్రి ఎన్టీఆర్ ని.. అంటూ ఎన్టీఆర్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు వర్మ.

PREV
click me!

Recommended Stories

Ranveer vs Deepika: బాక్సాఫీస్ దగ్గర భార్యదే పైచేయి.. భర్త వెనుకబడింది ఇక్కడే!
Vijay Divorce: రూ.250 కోట్లు అడిగిన సంగీత.. విజయ్ ఇచ్చేది రూ.35 కోట్లేనా? అసలు నిజమెంత?