యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపుల్లో ప్లే చేసిన కులం!

Published : Oct 06, 2018, 10:22 AM IST
యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపుల్లో ప్లే చేసిన కులం!

సారాంశం

బిగ్ బాస్ షో పూర్తయి వారం రోజులే అయింది.. ఆ షో పూర్తయిన వెంటనే 'పెళ్లిచూపులు' ప్రోగ్రాంని టెలికాస్ట్ చేస్తున్నారు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ. ఈ షో కాన్సెప్ట్ ఏంటంటే.. మగ స్వయంవరం. ఉత్తరాదిన ఈ కాన్సెప్ట్ తో చాలా కార్యక్రమాలు వచ్చాయి. 

బిగ్ బాస్ షో పూర్తయి వారం రోజులే అయింది.. ఆ షో పూర్తయిన వెంటనే 'పెళ్లిచూపులు' ప్రోగ్రాంని టెలికాస్ట్ చేస్తున్నారు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ. ఈ షో కాన్సెప్ట్ ఏంటంటే.. మగ స్వయంవరం. ఉత్తరాదిన ఈ కాన్సెప్ట్ తో చాలా కార్యక్రమాలు వచ్చాయి.

కానీ తెలుగుకి మాత్రం ఇదే తొలిసారి. 14 మంది అమ్మాయిలు రకరకాలుగా ఓ వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి తంటాలు పడుతుంటారు. ఈ షో మొదలై రెండో రోజు నుండే విమర్శలు మొదలయ్యాయి. ప్రదీప్ కి అమ్మాయిల్లో ఫ్యాన్స్ ఉండొచ్చు.. కానీ వారి ఫీలింగ్స్ తో షో చేయడమనేది కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొందరు ఇది షో మాత్రమే అనుకొని పరిమితులలో ఉంటుంటే మరికొందరు మాత్రం ప్రదీప్ తో ఇప్పటినుండే జీవితాన్ని ఊహించేసుకుంటున్నారు. కొందరు పిల్లల వరకు వెళ్లిపోయారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ షో చూడడానికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

గేమ్ ఆడుతున్న సమయంలో అమ్మాయిల మధ్య గొడవలు రావడం, ఒకరిపై మరొకరు ఈగోలు పెంచుకోవడం వంటి విషయాలతో సోషల్ మీడియాలో కామెంట్లు మరింత ఎక్కువయ్యాయి. అమ్మాయిల ఫీలింగ్స్ తో షోని నడిపిస్తున్నారు. 

ఇక్కడ మరో విషయం బయటకొచ్చింది.. అదేంటంటే.. పెళ్లిచూపులు కోసం అమ్మాయిలను ఎంపిక చేసే క్రమంలో వారి కులాల ప్రస్తావన తీసుకొచ్చారట. నేరుగానే అమ్మాయిలను నీది ఏ కులం అని ప్రశ్నించారట. ఆ కోణంలో కూడా కొందరిని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.  '

ఇవి కూడా చదవండి.. 

యాంకర్ 'పెళ్లిచూపులు' నిశ్చితార్ధం వరకేనా..?

యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు: ఎక్కువ ఇంప్రెష్ చేసిన అమ్మాయి ఎవరంటే...

 

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు