మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ.. క్లిక్ చేశారా అంతే!

Published : Oct 06, 2018, 09:37 AM ISTUpdated : Oct 06, 2018, 09:39 AM IST
మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ.. క్లిక్ చేశారా అంతే!

సారాంశం

తెలుగులో 'దేవదాసు' సినిమాతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ దక్కించుకున్న నటి ఇలియానా.. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి ఓ వెలుగు వెలిగింది. 'బర్ఫీ' సినిమా తరువాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో ఆమె టాలీవుడ్ కి దూరమైంది. 

ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమాలో నటిస్తోంది. సినిమాలతో  పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఇలియానా.. తన బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొడుతూ ఆ ఫొటోలన్నీ కూడా అభిమానులతో పంచుకుంటుంది. 

ఇటీవల అమెరికన్ గ్లోబల్ కంప్యూటర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ కంపెనీ మకా ఫీ (MCA Fee) నిర్వహించిన సర్వేలో ఇలియానా అత్యంత ప్రమాదకర సెలబ్రిటీగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఇలియానా. తప్పుడు వెబ్‌సైట్లు క్లిక్ చేసేందుకు హ్యాకర్లు బాగా పేరొందిన సెలబ్రిటీల పేర్లను వాడుకుంటారు.

వారి ఫొటోలను ఇతర వివరాలను ఎరగా చూపించి వైరస్ లను వ్యాప్తిజేస్తున్నారు. ఇటీవల హ్యాకర్లు ఇలియానా ఫోటోలను బాగా వాడుకుంటూ నెటిజన్లను ఇబ్బంది పెడుతున్నారట. ఇలియానా తర్వాతి స్థానంలో ప్రీజి జింటా.. వీరితోపాటు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణే, కృతి సనన్, అక్షయ్ కుమార్, రిషీ కపూర్, పరిణితీ చోప్రా కూడా ఉన్నారు

PREV
click me!

Recommended Stories

Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. సంగీత విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌