నా ఆస్తుల్ని సీజ్ చేసేశారు.. కమల్ హాసన్ వ్యాఖ్యలు!

Published : Oct 06, 2018, 09:55 AM IST
నా ఆస్తుల్ని సీజ్ చేసేశారు.. కమల్ హాసన్ వ్యాఖ్యలు!

సారాంశం

విలక్షణ నటుడు కమల్ హసన్ ప్రస్తుతం 'మక్కల్ నీది మయ్యం' అనే రాజకీయ పార్టీని స్థాపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు కమల్ హాసన్ వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్.. రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు చెప్పారు

విలక్షణ నటుడు కమల్ హసన్ ప్రస్తుతం 'మక్కల్ నీది మయ్యం' అనే రాజకీయ పార్టీని స్థాపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు కమల్ హాసన్ వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్.. రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు చెప్పారు.

ఓ కామెంట్ చేసినందుకు ఆయనకి రాజకీయ నాయకుల నుండి బెదిరింపులతో పాటు.. ఆయన ఆస్తులన్నీ కూడా సీజ్ చేసేశారట. ఇది పెద్ద గుణపాఠమని ఆయన వెల్లడించారు.. రాజకీయాలు మంచివి కాదని కమల్ కు చాలా మంది చెప్పేవారట..

వాళ్లంతా కూడా రాజకీయ నాయకులే కావడం గమనార్హం. ఇక తాను రాజకీయాల్లోకి పీఆర్ ఉద్యోగమ చేయడానికి రాలేదని ప్రజల కోసం మాట్లాడడానికి వచ్చినట్లు వెల్లడించారు. రజినీకాంత్ ని కాకుండా మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలని అడిగిన ప్రశ్నకి.. ప్రజలు సరైన నాయకుడిని ఎన్నుకున్నారు.. ప్రముఖ వ్యక్తిని కాదు.. అంటూ చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: `అఖండ 2` 22 రోజుల కలెక్షన్లు.. బాలయ్య సినిమా వంద కోట్లు దాటినా లాభం లేదు
రాజాసాబ్ స్టార్స్ రెమ్యూనరేషన్స్, ప్రభాస్ పారితోషికం లో భారీ కోత, ఎవరెంత తీసుకున్నారంటే?