`ఆచార్య` నుంచి `నీలాంబరి..` సాంగ్‌ ప్రోమో ఔట్‌ః రామ్‌చరణ్‌, పూజా హెగ్డేపై కట్టిపడేస్తున్న మెలోడీ..

Published : Nov 04, 2021, 02:10 PM IST
`ఆచార్య` నుంచి `నీలాంబరి..` సాంగ్‌ ప్రోమో ఔట్‌ః రామ్‌చరణ్‌, పూజా హెగ్డేపై కట్టిపడేస్తున్న మెలోడీ..

సారాంశం

`ఆచార్య` సినిమా నుంచి మరో పాటని దీపావళి పండుగ సందర్భంగా గురువారం విడుదల చేశారు. `నీలాంబరి` అంటూ సాగే పాట ప్రోమోని రిలీజ్‌ చేయగా, అది ట్రెండ్‌ అవుతుంది. అయితే ఈ పాట రామ్‌చరణ్‌, ఆయనకు జోడిగా నటించిన పూజా హెగ్డేలపై చిత్రీకరించడం విశేషం.

చిరంజీవి(Chiranjeevi), రామ్‌చరణ్‌(Ram Charan) హీరోలుగా నటిస్తున్న చిత్రం `ఆచార్య`(Acharya) ఇందులో Chiranjeevi సరసన కాజల్‌, రామ్‌చరణ్‌ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. అయితే రామ్‌చరణ్‌ పాత్ర ఇందులో కీలకంగా ఉంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేసింది. సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ స్టార్ట్ చేసింది. దీపావళి కానుకగా ఈ చిత్రంలోని రెండో సాంగ్‌ని విడుదల చేశారు. ఇప్పటికే `లాహే లాహే.. `అంటూ సాంగే పాటని విడుదల చేయగా, అది ఎంతగానో మెప్పించింది. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అయ్యింది. 

ఇప్పుడు ఇందులోని మరో పాటని దీపావళి పండుగ సందర్భంగా గురువారం విడుదల చేశారు. `నీలాంబరి`(Neelambari) అంటూ సాగే పాట ప్రోమోని రిలీజ్‌ చేయగా, అది ట్రెండ్‌ అవుతుంది. అయితే ఈ పాట రామ్‌చరణ్‌, ఆయనకు జోడిగా నటించిన Pooja Hegdeలపై చిత్రీకరించడం విశేషం. రామ్‌చరణ్‌ అదిరిపోయే స్టెప్పులతో అలరిస్తున్నారు. పూజా హెగ్డే ఆయన్ని చూసిన విధానం కట్టిపడేస్తుంది. మణిశర్మ మెలోడీ నుంచి వచ్చిన ఈ పాట శ్రోతలను మెప్పిస్తూ వైరల్ అవుతుంది. మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. పూర్తి పాటని రేపు నవంబర్‌ 5న విడుదల చేయబోతున్నారు.

నక్సల్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సిద్ధాగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ఆయన సరసన కనిపించే పూజా హెగ్డే నీలాంబరి పాత్రలో కనువిందు చేయనుందట. తాజాగా పాటలో ఆమె హాఫ్‌ శారీలో కనువిందు చేస్తుంది. అందంతో కట్టిపడేస్తుంది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రామ్‌చరణ్‌, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

also read: విజయ్‌ దేవరకొండ `లైగర్‌` నుంచి మైక్‌ టైసన్‌ ఫస్ట్ లుక్‌.. మైండ్‌ బ్లోయింగ్‌

రామ్‌చరణ్‌,  చిరంజీవి నటిస్తున్న తొలి చిత్రమిది. గతంలో చరణ్‌ నటించిన `మగధీర`లో ఓ పాటలో, `బ్రూస్‌లీ`లో చివర్లో గెస్ట్ గా మెరిశారు చిరంజీవి. కానీ చిరంజీవి సినిమాలో చరణ్‌ కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్‌ అని చెప్పొచ్చు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా కమర్షియల్‌, సామాజిక సందేశాన్ని మేళవించి అద్భుతమైన సినిమాలు అందించే కొరటాల నుంచి వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు నెలకొన్నాయి. దేవదాయ శాఖలోని అవినీతిని వెలికితీసే కథతో సినిమా సాగుతున్నట్టు తెలుస్తుంది. 

also read: samantha: పండగ వేళ అదిరిపోయే హాట్‌ ఫోటోస్‌ షేర్‌ చేసిన సమంత.. నడువొంపులతో కుర్రాళ్లకి అసలైన ఫెస్టివల్
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

మూర్ఖులే అలాంటి పనిచేస్తారు, బాడీ షేమింగ్‌ బాధితులపై నటి రచితా రామ్ కామెంట్స్ వైరల్..
ఎన్టీఆర్, ఏఎన్నార్ కాకుండా.. ఫిల్మ్ ఇండస్ట్రీ దేవుడిలా చూసిన మరో స్టార్ హీరో ఎవరో తెలుసా ?