దీపావళి సంబరాల్లో మెగా, అల్లు వారి ఫ్యామిలీ.. ఆ రూమర్స్ కి చెక్‌ పెట్టినట్టేనా?

Published : Nov 04, 2021, 10:25 AM IST
దీపావళి సంబరాల్లో మెగా, అల్లు వారి ఫ్యామిలీ.. ఆ రూమర్స్ కి చెక్‌ పెట్టినట్టేనా?

సారాంశం

 మెగా, అల్లు వారి ఫ్యామిలీ కలిసి దీపావళి సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.  ఈ సందర్భంగా దిగిన ఫోటోని పంచుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.   

తెలుగు చిత్ర పరిశ్రమలో దీపావళి పండుగ ప్రారంభమైంది. సెలబ్రిటీలు తమ ఇళ్లల్లో దీపావళి సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. మరోవైపు పండుగ  సందర్భంగా తమ కొత్త సినిమాల పోస్టర్లు, టీజర్లతో ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నారు. ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా మెగా, అల్లు వారి ఫ్యామిలీ కలిసి దీపావళి సెలబ్రేట్‌(Diwli Celabration) చేసుకుంటున్నారు.  ఈ సందర్భంగా దిగిన ఫోటోని పంచుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఇందులో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun), మెగా పవర్ స్టార్‌ రామ్‌చరణ్‌(Ram Charan), నిహారిక(Niharika), ఆమె భర్త చైతన్య, బన్నీ భార్య స్నేహారెడ్డి, రామ్‌చరణ్‌ వైఫ్‌ ఉపాసన, చిరంజీవి కూతుళ్లు సుస్మిత, అల్లు అర్జున్‌ అన్నయ్య అల్లు బాబీ, ఆయన వైఫ్‌, హీరో వైష్ణవ్‌ తేజ్‌ ఉన్నారు. వీరితోపాటు కుటుంబసభ్యులున్నారు. ఈ పిక్‌ పంచుకుని అభిమానులకు దీపావళి విషెస్‌ తెలిపారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ పిక్‌ అందరిని దృష్టిని ఆకర్షించిది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

అయితే ఇందులో మెగా ప్యామిలీ పెద్ద హీరోలు లేకపోవడం గమనార్హం. కేవలం పిల్లలు మాత్రమే ఉన్నారు. చిరంజీవి, నాగబాబు, పవన్‌, అల్లు అరవింద్ ఈ ఫోటోలో లేకపోవడంతో వాళ్లు ఈ సెలబ్రేషన్‌లో పాల్గొనలేదా? లేక ఫోటోలోనే లేరా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఇటీవల మెగా ఫ్యామిలీకి, అల్లు వారి ఫ్యామిలీకి మధ్య విభేదాలున్నాయని, రెండు కుటుంబాలకు గ్యాప్‌ వచ్చిందనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజా పిక్ మాత్ర ఆ రూమర్స్ కి చెక్‌ పెట్టినట్టే అని అంటున్నారు అభిమానులు. మరి అందులో నిజమెంతా అనేది చూడాల్సి ఉంది. 

ప్రస్తుతం అల్లు అర్జున్‌ `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. తొలి భాగంగా డిసెంబర్ 17న విడుదల కానుంది. మరోవైపు రామ్‌చరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 7న రిలీజ్ కాబోతుంది. వైష్ణవ్‌ తేజ్‌ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అల్లు బాబీ ఆహాతో బిజీగా ఉన్నారు. నిహారిక మ్యారేజ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. 

also read: Adipurush Update: దీపావళి రోజు గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభాస్‌.. `ఆదిపురుష్‌` సెట్‌లో సంబరాలు

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..