విజయ్‌ దేవరకొండ `లైగర్‌` నుంచి మైక్‌ టైసన్‌ ఫస్ట్ లుక్‌.. మైండ్‌ బ్లోయింగ్‌

By Aithagoni RajuFirst Published Nov 4, 2021, 1:30 PM IST
Highlights

విజయ్‌ దేవరకొండ సరసన బాలీవుడ్‌ భామ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి దీపావళి సర్ప్రైజ్‌ ఇచ్చింది యూనిట్‌. ఇందులో కీలక పాత్రలో నటిస్తున్న వరల్డ్ లెజెండరీ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ నటిస్తున్నారు. 

విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటిస్తున్న చిత్రం `లైగర్‌`(Liger). `సాలా క్రాస్‌బ్రీడ్‌` అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న చిత్రమిది. పూరీ జగన్నాథ్‌(Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ప్యాన్‌ ఇండియా మూవీగా దీన్ని రూపొందుతున్నారు. కరణ్‌ జోహార్‌, పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Vijay Devarakonda సరసన బాలీవుడ్‌ భామ అనన్య పాండే(Ananya Panday) హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి దీపావళి సర్ప్రైజ్‌ ఇచ్చింది యూనిట్‌. ఇందులో కీలక పాత్రలో నటిస్తున్న వరల్డ్ లెజెండరీ బాక్సర్‌ మైక్‌ టైసన్‌(Mike tyson) నటిస్తున్నారు. 

ఇందులో ఆయన పాత్ర లుక్‌ని పరిచయం చేసింది యూనిట్‌. పవర్‌ఫుల్‌ పంచ్‌ ఇస్తున్నట్టుగా ఉన్న Mike Tyson పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ పంచుకుని మైక్‌ టైసన్‌కి ఇండియా తరఫున వెల్‌కమ్‌ పలుకుతున్నారు. `బాస్‌ నమస్తే` అంటూ ట్వీట్‌ చేశారు విజయ్‌ దేవరకొండ. హ్యాపీ దీపావళి అంటూ ఇండియా నుంచి అమితమైన ప్రేమని పంచుతున్నట్టు చెప్పారు. తనని వెండితెరపై చూసేందుకు ఆసక్తికగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. 

Happy Diwali Indiaaa 🤗
Pakka 🔥
2022. pic.twitter.com/ZQxuIvPd1z

— Vijay Deverakonda (@TheDeverakonda)

దీనికి మైక్‌ టైసన్‌ స్పందించారు. నమస్తే ఇండియా అంటూ విజయ్‌కి అభినందనలు తెలిపారు మైక్‌ టైసన్‌. ప్రస్తుతం మైక్‌ టైన్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం `లైగర్‌` షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకు రెడీ అవుతుంది. `బాక్సింగ్‌` నేపథ్యంలో సినిమా సాగుతున్న నేపథ్యంలో వరల్డ్ బాక్సింగ్‌ ఛాంపియన్‌ని ఇందులో నటింప చేయడం విశేషం. 

మైక్‌ టైసన్‌ అమెరికన్‌ ప్రొఫేషనల్‌ బాక్సర్‌. 1985 నుంచి 2005 వరకు దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆయన బాక్సింగ్‌ని శాషించారు. `ఐరన్‌ మైక్‌`, `కిడ్‌ డైనమైట్‌`, `ది బ్యాడెస్ట్ మ్యాన్‌ ఆన్‌ ది ప్లానెట్‌` అనే పేర్లు తెచ్చుకున్న మైక్‌ టైసన్‌ హెవీ వెయిట్‌ బాక్సార్‌గా గ్రేటెస్ట్ బాక్సర్‌గా నిలిచారు. ఆయన మొత్తం 58సార్లు పోటీల్లో పాల్గొనగా, 50సార్లు విజయం సాధించారు.

also read: Manchi Rojulochaie Review: `మంచి రోజులు వచ్చాయి` సినిమా రివ్యూ.. మారుతి బ్రాండ్‌ వర్కౌట్‌ అయ్యిందా?

click me!