Gentleman Sequel: జెంటిల్ మెన్ సీక్వెల్ లో నయనతార, హీరోకంటే ముందే హీరోయిన్ ఫిక్స్.

Published : Mar 21, 2022, 10:42 PM IST
Gentleman Sequel: జెంటిల్ మెన్ సీక్వెల్ లో నయనతార, హీరోకంటే ముందే హీరోయిన్ ఫిక్స్.

సారాంశం

కోలీవుడ్ లో జెంటిల్మెన్ సీక్వెల్ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ కోసం మేకర్స్ రెడీ అవ్వగా.. అన్నింటికంటే ముందు హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.   

1990లలో వచ్చి భారీ సక్సెస్ సాధించిన సినిమాల్లో జెంటిల్ మేన్ ఒకటి. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కు లైఫ్ ఇచ్చిన ఈమూవీని కుంజుమోన్ నిర్మించారు. ఓ కుర్రాడు వచ్చి తన కథతో అప్పటికే స్టార్ హీరో అయిన అర్జున్ ను మెప్పించడం  ఈ సినిమా చేయడం సూపర్ డూపర్ హిట్ అవ్వడం జరిగిపోయాయి.  అర్జున్ హీరోగా మధుబాల హీరోయిన్ గా  నటించిన ఈ సినిమా, తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఒక ఊపు ఊపేసింది. 

అటు అర్జున్ .. ఇటు శంకర్ కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది ఈ సినిమా.ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా మ్యుజికల్ హిట్ గా నిలిచింది. అప్పటి నుంచి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన చేశారుగానీ వర్కౌట్ కాలేదు. మళ్లీ ఇంతకాలానికి ఆ సినిమా సీక్వెల్ విషయం తెరపైకి వచ్చింది. ఆ సినిమాకు సీక్వెల్ తీయడానికి కుంజుమోన్ రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు. 

 అయితే ఈ సినిమా సీక్వెల్ కు హీరోగా అర్జున్ ను అడిగారో లేదో తెలియదు కాని హీరోయిన్ ను మాత్రం ముందే ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఈ స నిమాలో కథానాయిక పాత్ర కోసం నయనతారను సంప్రదించినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది.  కథ నచ్చితే నయనతార  గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అన్న పేరు ఉంది. ఈ సినిమా చేయడానికి ఆమె రెడీగా ఉంది అని టాక్. 

ఇక మరో విషేశం ఏంటి అంటే..ఈ సినిమాకు  సంగీత దర్శకుడిగా కీరవాణితో మాటలు జరుగుతున్నాయని అంటున్నారు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను ఈ టాక్ వినిపిస్తోంది. శంకర్ ఇప్పట్లో తీరిక చేసుకునే పరిస్థితి లేదు.  అటు రామ్ చరణ్ సినిమా.. ఇటు భారతీయుడు సీక్వెల్ .. మరో వైపు బాలీవుడ్ లో అపరిచితుడు.. మరి జెంటిల్ మెన్ ఎప్పుడు చేస్తాడు అని డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. చూడాలి మరి ఇది రూమర్ గానే మిగిలిపోతుందా.. లేకు సినిమాగా రూపాంతరం చెంతుతుందా అనేది. 

PREV
click me!

Recommended Stories

Actress Roja: రోజా నిద్రపోతుంటే రజనీకాంత్ చేసిన అల్లరి పనికి అంతా షాక్‌.. సెట్‌లో సూపర్‌స్టార్‌ ఎలా ఉంటారంటే?
Varanasi Update: మహేష్‌ `వారణాసి` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌.. అప్పట్నుంచే అసలైన పండగ షురూ