Ajith: హీరో అజిత్‌ పేరుతో సరికొత్త రికార్డ్.. కనీవినీ ఎరుగని రీతిలో అతిపెద్ద పోస్టర్‌ తో సంచలనం

Published : Mar 21, 2022, 10:21 PM IST
Ajith: హీరో అజిత్‌ పేరుతో సరికొత్త రికార్డ్.. కనీవినీ ఎరుగని రీతిలో అతిపెద్ద పోస్టర్‌ తో సంచలనం

సారాంశం

తమిళ స్టార్ హీరో అజిత్ పేరుతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది  ప్రముఖ ఓటీటీ సంస్థ. కనీ వినీ ఎరుగని రీతిలో అజిత్ భారీ పోస్టర్ ను డిజైన్ చేసిందీ సంస్థ. అభిమానులకు మంచి సర్ప్రైజ్ ఇచ్చింది. 

అజిత్ కుమార్ యాక్షన్ ప్యాక్డ్ వలీమై ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ బ్లాక్‌బస్టర్ ప్రీమియర్‌ను చూసే సమయం వచ్చింది.తమిళ సూపర్‌స్టార్‌ అజిత్‌ నటించిన వలీమై మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించింది.  ఇక ఈమూవీ ఇఫ్పుడు డిజిటల్ రిలీజ్ కు రెడీ అవుతుంద.  వాలిమై మూవీ జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాంపై ఈనెల 25 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతోంది. 

ఈ సందర్భంగా అజిత్‌ కుమార్‌ గౌరవార్ధం  ఓటీటీ  సంస్థ చెన్నైలోని వైయంసీఏ సర్కిల్‌లో 10,000 అడుగుల పొడవైన అతిపెద్ద పోస్టర్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశం లో ఏ ఓటిటి సంస్థ ఇటువంటి అతి పెద్ద పోస్టర్ ను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ టాక్‌ ఆఫ్‌ టౌన్‌ అయ్యింది. అలాగే సోషల్‌ మీడియాలో కూడా ఈ విషయం విపరీతంగా వైరల్‌ అవుతూ అజిత్‌ ఇమేజ్‌ను మరింతగా పెంచుతోంది. అందరూ ఈ పోస్టర్‌ను చూసి అభినందిస్తుంటే  అజిత్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

2022లో తమిళ,తెలుగు ఆడియన్స్ ఎంతో  ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా వలీమై. ఇందులో అజిత్ కుమార్ IPS ఆఫీసర్ అర్జున్‌ పాత్రలో నటించగా, హుమా ఖురైషీ ముఖ్య పాత్రలో నటించారు. ఫుల్ యాక్షన్ ఏంటర్ టైన్మెంట్స్ తో పాటు ఎమోషన్స్ తో  కూడిన క్లీన్ కాప్ డ్రామా గా తెరకెక్కిన  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ వలిమై. అజిత్ కుమార్ కు ఆపోజిట్ రోల్ లో తెలుగు యంగ్ హీరో కార్తికేయ నటించారు. 

కాని తమిళంలో మంచి విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింద. హెచ్.వినోత్ రచనా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను జీ స్టూడియోస్‌ తో కలిసి బేవ్యూ ప్రాజెక్ట్ ఎల్‌ఎల్‌పికి చెందిన బోనీ కపూర్ నిర్మించారు. ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి, కార్తికేయలు నటించారు.యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు.
 

PREV
click me!

Recommended Stories

Ranabaali: రియల్‌ కపుల్‌ రొమాన్స్ అదిరిపోయేలా ఏందయ్య సామీ.. రణబాలి నుంచి ఫస్ట్ సాంగ్‌ ఎలా ఉందంటే?
జీవితంలో ఎంత క‌ష్ట‌మైనా రానీ.. ఒక్క‌సారి ఈ పాట వింటే మీ ఆలోచ‌న మార‌డం ఖాయం