`గాడ్‌ ఫాదర్‌` సెట్‌లో చిరంజీవి, సల్మాన్‌ సందడి.. పిక్చర్‌ పర్‌ఫెక్ట్.. లేటెస్ట్ ఫోటో ట్రెండింగ్‌

Published : Mar 21, 2022, 07:38 PM IST
`గాడ్‌ ఫాదర్‌` సెట్‌లో చిరంజీవి, సల్మాన్‌ సందడి.. పిక్చర్‌ పర్‌ఫెక్ట్.. లేటెస్ట్ ఫోటో  ట్రెండింగ్‌

సారాంశం

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రాల్లో `గాడ్‌ ఫాదర్‌` ఒకటి. మలయాళ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా సెట్‌లోని ఓ ఫోటో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది.

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నుంచి రాబోతున్న పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ `గాడ్‌ ఫాదర్‌`(God Father). మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన `లూసీఫర్‌` చిత్రానికిది రీమేక్‌. మోహన్‌ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఇందులో కీలక పాత్రలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన సినిమా సెట్‌లో జాయిన్‌ అయ్యారు. చిరంజీవి ఆయనకు స్వాగతం పలికారు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం సల్మాన్‌, చిరంజీవిలపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. అందులో భాగంగా యూనిట్‌ సందడి చేసింది. సెట్‌లోని ఓ పిక్‌ని పంచుకుంది యూనిట్‌. షూటింగ్‌ సమయంలో నిర్మాతలు ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు కూడా సెట్ కి వచ్చారు. దీంతో అందరు కలిసి సెట్‌లో ఫోటో దిగారు. దర్శకుడు మోహన్‌రాజుతోపాటు సల్మాన్‌, చిరు, ఆర్బీ చౌదరీ, ఎన్వీప్రసాద్‌ కలిసి దిగిన ఫోటోని అభిమానులతో పంచుకోగా, ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ఈ ఫోటోని చూసిన అభిమానులు పిక్చర్‌ పర్‌ఫెక్ట్ అంటూ కామెంట్లు చేయడం విశేషం. 

ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో పాల్గొంది. ఆమెకి వెల్‌కమ్‌ చెప్పారు దర్శకుడు మోహన్‌రాజా. ఆమెపై పలు ప్రధాన సన్నివేశాలు చిత్రీకరించినట్టు తెలుస్తుంది. మరోవైపు సత్యదేవ్‌ సైతం ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరల్లో థియేటర్‌లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్‌ జరుగుతుందట.

ఇదిలా ఉంటే ఈ చిత్రంతో తెలుగులోనూ మార్కెట్‌ని విస్తరించుకునేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు సల్మాన్‌ ఖాన్. ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాల హవా సాగుతుంది. తెలుగు పాన్‌ ఇండియా చిత్రాలు బాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. దీంతో బాలీవుడ్‌ హీరోలు తెలుగు మార్కెట్‌ని టార్గెట్‌ చేశారట. అందుకోసం ఇక్కడ తమ ప్రభావం చూపాలనుకుంటున్నారు. తెలుగు ఆడియెన్స్ కి దగ్గరవ్వాలనుకుంటున్నారు. దీనివల్లే సల్మాన్‌ తెలుగులో ఈ సినిమా చేస్తున్నారని టాక్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
మహేష్, బన్నీ లది ఒక లెక్క, చిరంజీవిది మరో లెక్క..వరల్డ్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ కి మెగాస్టార్ ప్లాన్