నయనతారకు అంత ఇవ్వలేకే ఆగిపోతున్నాం

By Surya PrakashFirst Published Apr 26, 2021, 12:57 PM IST
Highlights

 నయనతార ఈ తరహా పాత్రలను బాగా చేస్తుంది. ఆ పాత్రను ఆమె చేస్తే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ నయనతార తీసుకునే రెమ్యునేషన్ చాలా ఎక్కువ .. అందువలన ఆమెతో చేయడం కష్టమేనేమో


పాత క్లాసిక్ లు రీమేక్ చేయటం హాలీవుడ్ లో ఎప్పటినుంచో ఉన్నదే. అయితే మనకు అంత ధైర్యం చేసే పరిస్దితి లేదు. ఆల్రెడీ టీవీల్లో, యూట్యూబ్ లలో ఒరిజనల్ దొరికుతున్నప్పుడు మళ్లీ ఎవరు చూస్తారనేది చాలా మంది నిర్మాతలకు వచ్చే ఆలోచన. అయితే నిర్మాత కె.ఎస్ రామారావు మాత్రం కాలానికి ఎదురెళ్లే మనస్తత్వం. తన బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందించిన ఆయన ఇప్పుడు   ‘మాతృదేవోభవ’ రీమేక్ ప్లాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు.

 1993లో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘మాతృదేవోభవ’ ఒకటి. నాజర్‌, మాధవి ప్రధాన పాత్రల్లో కె. అజయ్‌ కుమార్‌ తెరకెక్కించిన ఈ సినిమా మహిళా ప్రేక్షకులను తెగ ఆకర్షించింది. అప్పట్లో ఈ సినిమాకు కర్చీఫ్ లు పంచేవారు అని చెప్పుకునేవారు. అంత హృదయాలని మెలితిప్పే సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. . ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోని ప్రేక్షకులు లేరు. అంతగా ప్రేక్షకులను కదిలించిన కథ ఇంతవరకూ మళ్లీ రాలేదు. 'అమ్మ' అనే రెండు అక్షరాలకు ఎంతటి బలమైన సెంటిమెంట్ ఉంటుందనే విషయాన్ని ఈ సినిమా చాటి చెప్పింది. 

క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కె.ఎస్‌. రామారావు నిర్మించారు. ఆనాటి ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్న ఈ చిత్రాన్ని ఈతరం వారికి చూపించేందుకు సన్నాహాలు చేయాలనుకుంటున్నారు. మరోసారి ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు నిర్మాత రామారావు.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ చిత్రానికి సంబంధించి తన మనసులో మాట పంచుకున్నారు. "ఈ తరం ప్రేక్షకులకు 'మాతృదేవోభవ' వంటి కథను పరిచయం చేయవలసిన అవసరం ఉంది. అందుకోసం ఆ సినిమాను రీమేక్ చేయాలనిపిస్తూ ఉంటుంది. దర్శకుడు అజయ్ కుమార్ తోను ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూనే ఉంటాను. ఈ తరం హీరోయిన్స్ లో నయనతార .. అనుష్క .. కీర్తి సురేశ్ వంటి వారితో ఈ సినిమా చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా నయనతార ఈ తరహా పాత్రలను బాగా చేస్తుంది. ఆ పాత్రను ఆమె చేస్తే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ నయనతార తీసుకునే రెమ్యునేషన్ చాలా ఎక్కువ .. అందువలన ఆమెతో చేయడం కష్టమేనేమో" అని చెప్పుకొచ్చారు.

ఇక్కడ మరో విషయం .. మలయాళ హిట్ మూవీ ‘ఆకాషదూతు’ను తెలుగులో ‘మాతృదేవోభవ’ పేరుతో రీమేక్ చేశారు. భర్తను కోల్పోయి, క్యాన్సర్‌ బారిన పడిన మహిళ తన పిల్లల భవిష్యత్తు కోసం పడిన ఆరాటమే ఈ సినిమా కథ. ఈ సినిమాలోని వేటూరి రాసిన, కీరవాణి స్వరాలు సమకూర్చిన ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ గీతం చిరస్థాయిగా నిలిచింది. 

click me!