నయనతార, విఘ్నేష్‌ శివన్‌ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్?

Published : Oct 22, 2021, 07:43 AM IST
నయనతార, విఘ్నేష్‌ శివన్‌ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్?

సారాంశం

ఇన్నాళ్లకి నయనతార, విఘ్నేష్‌ శివన్‌లకు లవర్స్ లైఫ్‌ బోర్‌ కొట్టినట్టుంది. ఇక పెళ్లికి సిద్ధమవుతున్నారట. ఇటీవలే వీరి ఎంగేజ్‌మెంట్‌ అయిన విషయం తెలిసిందే. సీక్రెట్‌గా జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని ఇటీవల ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌ ఇంటర్వ్యూలో నయనతార వెల్లడించింది. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు తెలిపింది. 

సౌత్‌లో మోస్ట్ ఎలిజిబుల్‌ ఫర్‌ మ్యారేజ్ కి జోడి ఏదైనా ఉందంటే అది నయనతార(Nayanathara), విఘ్నేష్‌ శివన్‌(Vignesh Shivan)ల జంటే అని చెప్పొచ్చు. చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట డేటింగ్‌ లైఫ్‌ బోర్‌ కొట్టినప్పుడు పెళ్లి చేసుకుంటామని చెబుతుంది. అయితే ఇన్నాళ్లకి వీరికి లవర్స్ లైఫ్‌ బోర్‌ కొట్టినట్టుంది. ఇక పెళ్లికి సిద్ధమవుతున్నారట. ఇటీవలే వీరి ఎంగేజ్‌మెంట్‌ అయిన విషయం తెలిసిందే. సీక్రెట్‌గా జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని ఇటీవల ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌ ఇంటర్వ్యూలో Nayanathara వెల్లడించింది. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు తెలిపింది. 

ఎంగేజ్‌మెంట్‌ జరిగి కూడా మూడు నాలుగు నెలలకుపైనే అవుతుంది. ఈ విషయం చెప్పి కూడా చాలా రోజులవుతుంది. ఇకా పెళ్లి ఊసే లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ వీరి మ్యారేజ్‌ వార్తలు ఊపందుకున్నాయి. ఇటీవల నయనతారకి Marriage జరిపించబోతున్నారనే వార్తలొచ్చాయి. కానీ Vignesh Shivanతో కాదట. నయనతార జాతకంలో ఏదో దోషం ఉన్న కారణంగా చెట్టుతో పెళ్లి జరిపించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ముందుగా చెట్టుతో పెళ్లి చేయబోతున్నారట. గతంలో ఐశ్యర్య రాయ్ కూడా తన జాతక దోష నివారనకై ఓ చెట్టును పెళ్లాడిన తర్వాత అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే మాదిరిగా ఇప్పుడు నయనతార కూడా ముందుగా ఓ చెట్టును పెళ్లాడనుందని, ఆ తర్వాత విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకోనుందట.

అందులో భాగంగా నయనతార, విఘ్నేష్‌ శివన్‌ మ్యారేజ్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారట. అయితే ఈ ఏడాది మాత్రం ఉండబోదని తెలుస్తుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఈ లవ్‌ కపులో పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించారట. దీనికి సంబంధించి డేట్‌ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్టు, అందుకు డేట్‌ని కూడా ఫిక్స్ చేశారనే వార్త వైరల్‌ అవుతుంది. అయితే అది ఎప్పుడనేది మాత్రం కాస్త సస్పెన్స్ గానే ఉంది. అయితే పెళ్లి మాత్రం సీక్రెట్‌గా కాకుండా చాలా గ్రాండ్‌గా, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంగానే చేసుకోవాలనుకుంటున్నారట. ఇదే విషయాన్ని నయనతార కూడా గత ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే. 

also read: సమంత పరువు నష్టం దావా: కోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రేపటికి వాయిదా

నయనతార ప్రస్తుతం రజనీకాంత్‌తో `అన్నాత్తే`, ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో `కాథు వాకుల రెండు కాదల్‌`, చిరంజీవితో `గాడ్‌ఫాదర్‌`, షారూఖ్‌ ఖాన్‌తో బాలీవుడ్‌లో ఓ సినిమాతోపాటు తమిళంలో రెండు సినిమాలు, మలయాలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karan Johar: ఆలియా, షారుఖ్ ఖాన్ లని అన్ ఫాలో చేసిన కరణ్ జోహార్.. ఇద్దరితో గొడవలా ?
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే