ప్రియుడితో న్యూయార్క్ లో చక్కర్లు కొడుతున్న నయన్

Published : Sep 19, 2017, 04:02 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ప్రియుడితో న్యూయార్క్ లో చక్కర్లు కొడుతున్న నయన్

సారాంశం

సెప్టెంబర్ 18న నయనతార బోయ్ ఫ్రెండ్ విక్కీ బర్త్ డే విగ్నేష్ విక్కీ పుట్టినరోజు వేడుకలు న్యూయార్క్ లో.. విగ్నేష్ శివన్ పుట్టిన రోజు సందర్భంగా నయన్ ట్రీట్

శింబు .. ప్రభుదేవాల తరువాత దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో నయనతార ప్రేమలో పడినట్టుగా వార్తలు వచ్చాయి. అవార్డుల ఫంక్షన్ కి ఇద్దరూ కలిసి వెళ్లడం .. అప్పుడప్పుడు ఇద్దరూ విదేశాలు చుట్టిరావడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది. ఇక విఘ్నేశ్ కి నయనతార ఖరీదైన ఓ కారును గిఫ్ట్ గా ఇచ్చిందనీ .. తన కుటుంబ సభ్యులకు ఆయనను పరిచయం చేసిందనే వార్తలు కూడా వచ్చాయి.
 

ఇక ఈ ఇద్దరూ న్యూయార్క్ వీధుల్లో షికారు చేస్తూ, అందుకు సంబంధించిన ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి తమ ప్రేమ వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. తమ గురించి అంతా మాట్లాడుకునేలా చేశారు. విఘ్నేశ్ శివన్ బర్త్ డే వేడుకను సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈ జంట న్యూయార్క్ వెళ్లినట్టు తెలుస్తోంది. చూడబోతే త్వరలోనే పెళ్లి కబురు చెప్పేలా వున్నారనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది.

 

నయన్ ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకుడిగా పెద్దగా సక్సెస్ కాకపోయినా లిరిక్ రైటర్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. సైమా అవార్డ్స్ వేడుకలో సింగపూర్ లో తమ రిలేషన్ షిప్ ను గురించి ఓపెన్ గా చెప్పేశారు ఈ కపుల్. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి.

 

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?