త్రివిక్రమ్ ను గాబరా పెడుతున్న పవన్ కళ్యాణ్

Published : Sep 19, 2017, 03:38 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
త్రివిక్రమ్ ను గాబరా పెడుతున్న పవన్ కళ్యాణ్

సారాంశం

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 25వ చిత్రం పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ కాంబినేషన్ కు యమా క్రేజ్ గతంలో అత్తారింటికి దారేది సూపర్ హిట్ తర్వాత వస్తోన్న కొత్త చిత్రం

తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ ల కాంబినేషన్ కున్న క్రేజ్ ఏంటో తెలిసిందే. అత్తారింటికి దారేదీ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత వీళ్ల కాంబినేషన్ లో రానున్న మరో చిత్రం పిఎస్పికే 25. ఈ మూవీని దసరాకే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దీంతో పవన్ కలవరపడుతున్నారు.

 

ఆరు నెలల్లో షూటింగ్‌ పూర్తి చేసేసి దసరాకి విడుదల చేయాలనే లక్ష్యంతో పవన్‌తో సినిమా మొదలు పెట్టిన త్రివిక్రమ్‌ ఇప్పటికి సగం మాత్రమే తీయగలిగాడట. పవన్‌ తన పర్సనల్‌ పనులతో, రాజకీయ చర్చలతో పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల చాలా షెడ్యూల్స్‌ అప్‌సెట్‌ అయినట్టు సమాచారం. 
 

ఇంకా ఈ చిత్రానికి అరవై రోజుల పాటు వర్కింగ్‌ షెడ్యూల్‌ వుందని, ఈ ఏడాదిలో మిగిలిన వంద రోజుల్లో పవన్‌ ఆ సమయం కేటాయించినట్టయితే జనవరి 10కి ఏ ఆటంకం లేకుండా ఈ చిత్రం రిలీజ్‌ అవుతుందని, లేదంటే పూర్తి చేయడానికి తంటాలు తప్పవని అంటున్నారు. పవన్‌ ఈ సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టకుండా నచ్చినపుడు షూటింగ్‌కి వస్తూ, నచ్చనపుడు పని వుందంటూ వెళ్లిపోతున్నాడనే అభియోగాలు వినిపిస్తున్నాయి.
 

నిజానికి సెప్టెంబర్‌ నాటికి ఈ చిత్రం పూర్తి చేసుకుని ఎన్టీఆర్‌ చిత్రం పనులు నవంబర్‌లో మొదలు పెట్టడం త్రివిక్రమ్‌ చేసుకున్న ఒప్పందం. ఎన్టీఆర్‌ జై లవకుశ పూర్తి చేసేసాడు కానీ త్రివిక్రమ్‌ మాత్రం బౌండ్‌ స్క్రిప్ట్‌ చేతిలో పెట్టుకుని కూడా దీనిని ఇంకా పూర్తి చేయలేకపోయాడు. పవన్‌ సహకరిస్తే షూటింగ్‌కి ఆటంకాలు వుండవని, ఒకవేళ పవన్‌ ఈలోగా రాజకీయ పనులంటూ సైడ్‌ ట్రాక్‌ పడితే మాత్రం... మాంచి కాంబినేషన్‌ సీన్లకి డేట్లు సాధించడం కష్టమని భోగట్టా.
 

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?